Realme P4 Lite 5G : ఇది కదా డిస్కౌంట్.. రూ. 20వేల ఈ రియల్‌మి 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ రూ. 12,999కే..!
Realme P4 Lite 5G : రియల్‌మి పీ4 లైట్ 5జీ కొంటున్నారా? ఈ చీపెస్ట్ 5జీ ఫోన్ భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. రియల్‌మి పీ4 లైట్ 5జీ ధర ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం..
Realme P4 Lite 5G
- ఈ ఫోన్లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
- రియల్‌మి P4 లైట్ 5జీలో 13MP మెయిన్ కెమెరా ఉంది
- మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ 2TB వరకు విస్తరించుకోవచ్చు
Realme P4 Lite 5G : కొత్త రియల్‌మి ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 7000mAh బ్యాటరీతో రియల్‌మి పీ4 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ కంపెనీ గత నెలలో రియల్‌మి P4 లైట్ 5జీ లాంచ్ చేసింది. ఈ పాపులర్ ఫోన్‌పై అసలు ధరపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
రియల్‌మి పీ4 లైట్ 5జీ అసలు ధర మీద 35శాతం వరకు (Realme P4 Lite 5G) డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇందులో భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ చిప్సెట్తో వస్తుంది. భారీ 6.8-అంగుళాల డిస్ప్లేతో పాటు, ఇందులో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌పై లభించే అదిరిపోయే డీల్ ఎలా పొందాలో పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మి P4 లైట్ 5జీ డిస్కౌంట్ ధర :
రియల్‌మి P4 లైట్ 5జీ ఫోన్ ఎన్నడూ లేనంత అత్యంత చౌక ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 35శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 19,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,999కే లభిస్తోంది.
ఇందులో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ నేరుగా రూ. 7వేలు డిస్కౌంట్ అందించింది. అంతేకాదు.. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 650 ఆదా చేసుకోవచ్చు. ఆ తర్వాత రియల్‌మి ఫోన్ ధర రూ. 12,349కు లభిస్తుంది.
రియల్‌మి P4 లైట్ 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P4 లైట్ 5జీ ఫోన్ 6.8-అంగుళాల HD+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ రియల్‌మి ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్మీ యూఐ 7.0పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
రియల్‌మి P4 లైట్ 5జీలో 13MP మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. సేఫ్టీ కోసం పక్కన ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64 రేటింగ్ అందిస్తుంది. MIL-STD 810H సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3 సపోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
