Redmi K90 Ultra Leak
Redmi K90 Ultra Leak : అతి త్వరలో కొత్త రెడ్‌మి అల్ట్రా ఫోన్ రాబోతుంది. రెడ్‌మి K90 సిరీస్‌లో ఇప్పటికే రెడ్‌మి K90, రెడ్‌మి K90 ప్రో మ్యాక్స్ రెండు ఫోన్లు చైనా మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ప్రస్తుతానికి రాబోయే రెడ్‌మి K90 అల్ట్రాకు సంబంధించి లీక్‌లు, పుకార్లు వెల్లడయ్యాయి. రెడ్‌మి K90 అల్ట్రా ఫోన్ అంచనా స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
రెడ్‌మి K90 అల్ట్రా డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు :
నివేదికల ప్రకారం.. రెడ్‌మి K90 రౌండెడ్ ఎడ్జ్‌లతో మెటల్ (Redmi K90 Ultra Leak) మిడిల్ ఫ్రేమ్ ఉండొచ్చు. ఈ రెడ్‌మి ఫోన్ 6.81-అంగుళాల ఎల్టీపీఎస్, ఓఎల్ఈడీ 1.5K డిస్‌ప్లేతో పాటు 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రాబోయే ఐక్యూ 15కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉండొచ్చు.
అంతేకాదు.. ఈ రెడ్‌మి ఫోన్ ఇప్పటివరకు లాంచ్ కాని మీడియాటెక్ డైమెన్సిటీ 9-సిరీస్ ప్రాసెసర్‌తో రన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్లస్ చిప్‌సెట్‌గా ఉండొచ్చునని అంచనాలు ఉన్నాయి. అంతేకాదు.. కెమెరా సిస్టమ్‌తో పోలిస్తే.. ఈ రెడ్‌మి ఫోన్ పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తుందని పుకార్లు ఉన్నాయి.
గత మోడల్‌తో పోలిస్తే.. కెమెరా సెక్షన్‌లో పెద్దగా అప్‌గ్రేడ్‌లను ఉండకపోవచ్చు. అయితే, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU) హై-ఆక్టేన్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అందించే స్టీమ్ రూం పరంగా మెయిన్ అప్‌గ్రేడ్‌లు ఉండొచ్చు.ఈ రెడ్‌మి ఫోన్ 8000mAh బ్యాటరీతో పాటు హై కెపాసిటీ గల ఛార్జింగ్ సపోర్టును కూడా పొందవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన అన్ని ఇతర వివరాలు ఇంకా రివీల్ కాలేదు. రాబోయే రోజుల్లో ఈ రెడ్‌మి ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
రెడ్‌మి K90 అల్ట్రా ధర (అంచనా) :
ప్రస్తుతానికి రెడ్‌మి K90 అల్ట్రా ధరకు సంబంధించి ఎలాంటి లీక్ కాలేదు. అదే లైనప్‌లోని ఇతర రెండింటితో పోలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదే పరిగణనలోకి తీసుకుంటే.. రెడ్‌మి K90 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.72,999కు అందుబాటులో ఉండొచ్చు.