Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ మడతబెట్టే ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. డోంట్ మిస్..!
Samsung Galaxy Z Fold 6 : ఈ శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మీకోసమే.. బిగ్ డిస్‌ప్లే, ప్రాసెసర్, అడ్వాన్స్ AI ఫీచర్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. అమెజాన్‌లో ఈ అద్భుతమైన డీల్ ఇలా పొందండి.
Samsung Galaxy Z Fold 6
Samsung Galaxy Z Fold 6 : కొత్త శాంసంగ్ ఫోన్ ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోన్ ధర తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో అత్యుత్తమ ఫోల్డబుల్స్ ఫోన్లలో ఇదొకటి. ఈ ఫోల్డబుల్ ఫోన్ భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంది.
అలాగే, అనేక ఏఐ ఫీచర్లు (Samsung Galaxy Z Fold 6) కూడా కలిగి ఉంది. ప్రస్తుతానికి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలుపై అమెజాన్ అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ భారీ డిస్‌ప్లే, స్ట్రాంగ్ ప్రాసెసర్, అడ్వాన్స్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ మడతబెట్టే ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం..
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 అమెజాన్ డీల్ :
ఈ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అమెజాన్‌లో అసలు లాంచ్ ధర రూ.1,64,999 నుంచి రూ.1,09,999కు తగ్గింది. అంతేకాదు.. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లందరకూ అదనంగా రూ.3,299 అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్ నేవీ సిల్వర్ షాడోతో సహా రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 7.6-అంగుళాల ఫోల్డబుల్ డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X ఔటర్ డిస్‌ప్లే కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్ 123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ శాంసంగ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 4MP కవర్ సెన్సార్, 10MP సెన్సార్ కలిగి ఉంది. 4400mAh బ్యాటరీతో పాటు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది.
