Redmi Note 12 Launch in India : 5G సపోర్టుతో రెడ్‌మి నోట్ 12 సిరీస్ ఫోన్ వచ్చేసింది.. టాప్ ఫీచర్లు ఇవే.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Redmi Note 12 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అదే.. Redmi Note 12 ఫోన్.. భారత మార్కెట్లో సరసమైన ధరకే ఈ 5G ఫోన్ అందుబాటులో ఉంది.

Redmi Note 12 launched in India_ Top specs, price, features and everything you need to know

Redmi Note 12 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అదే.. Redmi Note 12 ఫోన్.. భారత మార్కెట్లో సరసమైన ధరకే ఈ 5G ఫోన్ అందుబాటులో ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ గత ఏడాది నుంచి రెడ్‌మి నోట్ 11 కన్నా అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. 5G సపోర్టుతో పాటు పెద్ద డిస్‌ప్లే కలిగి ఉంది.

ఇప్పటికే భారత మార్కెట్లో Redmi Note 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. అయితే, భారత్-నిర్దిష్ట రెగ్యులర్ Redmi Note 12 రెండు కెమెరా సెన్సార్‌లకు బదులుగా వెనుకవైపు 3 కెమెరాలను కలిగి ఉంది. AMOLED డిస్‌ప్లే‌తో ఇప్పుడు 90Hzకి బదులుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మరో రెండు ప్రో మోడల్‌లను కూడా లాంచ్ చేసింది. అత్యంత సరసమైన రెడ్‌మి నోట్ 12 వేరియంట్ భారత మార్కెట్లో ఏయే టాప్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉందో ఓసారి లుక్కేయండి..

రెడ్‌మి Note 12 స్పెసిఫికేషన్స్ ఇవే :
Display : రెడ్‌మి Note 12 ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో Full-HD+ (2400×1080 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ బరువు కేవలం 188 గ్రాములు మాత్రమే ఉండగా, 7.98 మిమీ మందంగా ఉంటుంది.

Redmi Note 12 launched in India_ Top specs, price, features

Processor – Storage : ఈ కొత్త మోడల్ ఫోన్ 5G ఎనేబుల్ ఆప్షన్ కలిగి ఉంది. రెడ్‌మి Note 12 Qualcomm స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 నుంచి పవర్ అందిస్తుంది. చిప్‌సెట్ గరిష్టంగా 6GB RAM, 128GB స్టోరేజీతో వచ్చింది.

Read Also :  Redmi Note 10T 5G : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. అదిరిపోయే బ్యాటరీతో 5G ఫోన్ లాంచ్ చేసిన రెడ్‌మీ..!!

Battery : రెడ్‌మి Note 12లోని బ్యాటరీ సామర్థ్యం Redmi Note 11కి సమానంగా ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా అంతే ఉంటుంది. ఈ ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. USB టైప్-C పోర్ట్ ద్వారా ఫోన్ ఛార్జ్ అవుతుంది. చైనా-నిర్దిష్ట యూనిట్ గరిష్టంగా 8GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది.

Cameras : Redmi Note 12 ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోని అదే కలర్ బ్యాక్ మాడ్యూల్‌లో 48-MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా సెన్సార్, 2-MP మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం 13-MP స్నాపర్ ఉంది.

Redmi Note 12 launched in India

రెడ్‌మీ నోట్ 12 టాప్ ఫీచర్లు ఇవే :
Redmi Note 12 ఫోన్.. Android 12-ఆధారిత MIUI 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వచ్చింది. రెండు ప్రధాన Android అప్‌డేట్స్, 4 సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్‌తో వచ్చింది. MIUI ఇంటర్‌ఫేస్ రీడింగ్ మోడ్, స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్‌లతో ఇప్పటికే ఉన్న కొన్ని ఫీచర్లను కూడా కలిగి ఉంది. స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం యూజర్లు 120Hz లేదా 60Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారవచ్చు. సరసమైన పరిధిలో 5G అతిపెద్ద ఫీచర్ కానుంది.

భారత్‌లో Redmi Note 12 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో Redmi Note 12 ధర బేస్ 4GB RAM, 128GB స్టోరేజీ ధర రూ. 17,999 నుంచి ప్రారంభమవుతుంది. స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో 6GB RAM ఆప్షన్ ధర రూ. 19,999గా ఉండనుంది. Xiaomi కూడా ICICI బ్యాంక్‌తో కలిసి రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ స్టోరేజీ మోడల్ వరుసగా రూ. 16,499తో పాటు రూ.18,499కి అందుబాటులో ఉంటుంది. Redmi Note 12 సేల్ జనవరి 11 మధ్యాహ్నం Mi ఛానెల్, Amazonలో సేల్ అందుబాటులో ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio Airtel 5G in India : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్, జియో 5G సర్వీసులు.. ఏయే నగరాల్లో 5G నెట్‌వర్క్ ఉందంటే? మీ ఫోన్లలో ఇలా ఫ్రీగా యాక్సస్ చేసుకోవచ్చు!