Redmi Note 12 Pro Plus : భారత్‌కు రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

Redmi Note 12 Pro Plus : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెడ్‌మి నుంచి నోట్ 12ప్రో ప్లస్ (Redmi Note 12 Pro Plus) వచ్చేస్తోంది. వచ్చే జనవరి 25, 2023న భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్ అధికారికంగా లాంచ్ కానుంది.

Redmi Note 12 Pro Plus price in India leaked ahead of January 5 launch

Redmi Note 12 Pro Plus : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెడ్‌మి నుంచి నోట్ 12ప్రో ప్లస్ (Redmi Note 12 Pro Plus) వచ్చేస్తోంది. వచ్చే జనవరి 25, 2023న భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్ అధికారికంగా లాంచ్ కానుంది. లాంచ్ కావడానికి ముందే ఈ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. ఇప్పుడు లేటెస్టుగా ధర కూడా లీకైంది. ఈసారి టిప్‌స్టర్ డివైజ్ ధరను కూడా లీక్ చేసినట్టు నివేదిక వెల్లడించింది.

రెడ్‌మి నోట్ 12 ప్రో+ (Redmi Note 12Pro+) ధర భారత మార్కెట్లో రూ. 24,999 నుంచి ప్రారంభం కావచ్చని టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ పేర్కొన్నారు. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్, 8GB RAM + 256 స్టోరేజ్ మోడల్ ధర రూ. 26,999గా ఉంది. అయితే 12GB + 256GB వేరియంట్ ధర రూ. 28,999గా ఉంటుంది. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ ఫోన్ ధరలు బ్యాంక్ ఆఫర్‌లపై ఆధారపడి ఉంటాయని తెలిపింది.

Redmi Note 12 Pro Plus price in India leaked ahead of January 5 launch

Read Also : Redmi Note 12 5G India : ఇండియాకు రెడ్‌మి నోట్ 12 5G సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

చైనా మార్కెట్లో Redmi Note 12 Pro+ 5G ధర CNY 2,099కి ప్రారంభమైంది. అదే భారత మార్కెట్లో దాదాపు రూ. 23,000 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ అధికారిక ధర ఎంతో తెలియాలంటే మరి కొంతకాలం వేచి ఉండాల్సిందే.. భారత మార్కెట్లో లాంచ్ కాబోయే రెడ్‌మి 12ప్రో ఫీచర్లు చైనీస్ మోడల్‌కు సమానంగా ఉండే అవకాశం ఉంది. Redmi Note 12 Pro+ డివైజ్ 6.67-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో రిఫ్రెష్ అవుతుంది.

ప్యానెల్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్‌తో పాటు HDR10+కి సపోర్టు అందిస్తుంది. గరిష్టంగా 900నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు అందిస్తుంది. చైనాలో, Redmi Note 12 Pro+ MediaTek Dimensity 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల లాంచ్ అయిన Realme 10 Pro+ స్మార్ట్‌ఫోన్‌కు కూడా అదే ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 24,999గా ఉంది.

Redmi Note 12 Pro Plus price in India leaked ahead of January 5 launch

కంపెనీ Redmi Note 12 Pro+ ధరను ఇదే ధరతో రానుంది. హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చింది. 200-MP ఫోన్ డివైజ్ Samsung HPX ప్రైమరీ సెన్సార్‌తో భారత్‌లో అందుబాటులోకి రానుంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 12 ప్రో+లో మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉంది. హుడ్ కింద 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో సాధారణ 5,000mAh బ్యాటరీ యూనిట్ ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi Note 12 Pro Plus 5G : 200MP కెమెరాతో రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?