Redmi Turbo 5 : రెడ్‌మి లవర్స్‌కు బిగ్ షాక్.. ఈ టర్బో 5 ఫోన్ భారీగా పెరిగిందోచ్.. ఇంతకీ కొనాలా? వద్దా?
Redmi Turbo 5 : రెడ్‌మి టర్బో 5 ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఇదే ఫోన్ రూ. 6వేలు పెంపుతో లభిస్తోంది. ఇంతకీ ఈ షావోమీ సబ్ బ్రాండ్ ఫోన్ కొనాలా? వద్దా? మీదే ఛాయిస్..
- Sreehari A
- Published on- August 14, 2026 / 06:40 PM IST
Redmi Turbo 5
- ఒప్పో, వన్‌ప్లస్, షావోమీ పాపులర్ బ్రాండ్లు ధరలు పెరిగాయి
- రెడ్‌మి టర్బో 5 ధర ఇప్పుడు ఏకంగా రూ. 6 వేలు పెరిగింది
- ధరల పెంపుతో స్మార్ట్‌ఫోన్ కొనడం ఇప్పుడు అంత ఈజీ కాదు
Redmi Turbo 5 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు రూ. 10వేల ధరలో లభిస్తున్నాయి.
కానీ, ఇప్పుడు అవే స్మార్ట్‌ఫోన్లపై రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చుపెట్టాలి. ప్రతి కేటగిరీలోనూ స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్నాయి. శాంసంగ్, వివో, ఒప్పో, వన్‌ప్లస్, షావోమీ వంటి పాపులర్ బ్రాండ్‌లు అన్ని కేటగిరీల్లో భారీగా ధరలను పెంచాయి.
లోయర్ మిడ్‌రేంజ్, మిడ్‌రేంజ్ లేదా ఫ్లాగ్‌షిప్ ఏదైనా సరే ఇప్పుడు షావోమీ పాపులర్ స్మార్ట్‌ఫోన్లు మరింత (Redmi Turbo 5) ఖరీదైనవిగా మారాయి. ఇటీవలే లాంచ్ అయిన షావోమీ రెడ్‌మీ టర్బో 5 ధర ఇప్పుడు రూ. 6వేలు పెరిగింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే ఎక్కువ ధర పెట్టాలి. అదే పోకో ఫోన్‌ను ఇంతకన్నా తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. రెడ్‌మి టర్బో 5 ధర ఎంత పెరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భారత్‌లో రెడ్‌మి టర్బో 5 ధర పెంపు :
రెడ్‌మి టర్బో 5 ధర భారీగా పెరిగింది. 8GB+256GB వేరియంట్ ధర రూ.37,999 నుంచి ఇప్పుడు రూ.41,999కి పెరిగింది. అంటే.. ఈ ఫోన్ ధర రూ.6వేలు పెరిగింది. అదేవిధంగా, 12GB+256GB వేరియంట్ ధర రూ.40,999 నుంచి రూ.46,999కి పెరిగింది. ఈ 2 వేరియంట్ల ధరలు రూ.6వేలు పెరిగాయి.
పోకో ఎక్స్8 ప్రో ఫోన్ కూడా దాదాపు ఇదే స్పెసిఫికేషన్లతో వస్తుంది. కానీ ఈ ఫోన్ ధర రూ. 39,990 నుంచి లభ్యమవుతోంది. పోకో ఎక్స్8 ప్రోలో 6.59-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. పోకో ఎక్స్8 ప్రో 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా SoC అమర్చారు.
ఈ ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ ఉంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 27W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు కూడా అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత కారణంగా ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. ఒప్పో, వివో, శాంసంగ్ ఆపిల్ వంటి బ్రాండ్‌లు కూడా దాదాపు అన్ని డివైజ్‌ల ధరలను భారీగా పెంచేశాయి.
