Xiaomi 18 Pro Max : భారీ బ్యాటరీతో షావోమీ కొత్త సంచలనం.. భారీ అప్గ్రేడ్లు.. డబుల్ 200MP కెమెరాలు అదుర్స్..!
Xiaomi 18 Pro Max : చైనాలో షావోమీ 18 ప్రో మ్యాక్స్ లాంచ్ అయింది. ఈ ఫోన్లో 6.9-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 2nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్, 8500mAh బ్యాటరీ, రెండు 200MP రియర్ కెమెరాలు ఉన్నాయి.
Xiaomi 18 Pro Max
- షావోమీ 18 ప్రో మ్యాక్స్‌లో భారీ 8500mAh బ్యాటరీ ఉండొచ్చు
- ఈ ఫోన్లో రెండు 200MP రియర్ కెమెరాలు ఉన్నాయి
- 16GB వరకు ర్యామ్ ఆప్షన్‌తో కూడిన 2nm స్నాప్‌డ్రాగన్ చిప్
Xiaomi 18 Pro Max : షావోమీ కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్‌లో భాగంగా షావోమీ 18 ప్రో మ్యాక్స్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ అతిపెద్ద, అత్యంత ప్రీమియం మోడల్. ఇందులో 6.9-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 2nm టెక్నాలజీతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ 8,500mAh భారీ బ్యాటరీ ఉన్నాయి.
ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 2.9-అంగుళాల సెకండరీ స్క్రీన్ కూడా ఉంది. కెమెరా, నోటిఫికేషన్లు, అనేక ఇతర ఫీచర్ల కోసం (Xiaomi 18 Pro Max) వాడుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
షావోమీ 18 ప్రో మ్యాక్స్ ధర, లభ్యత :
షావోమీ 18 ప్రో మ్యాక్స్ చైనాలో 4 స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ కానుంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 6,999, సుమారుగా రూ. లక్షకు అందుబాటులో ఉంది. 12GB + 512GB మోడల్ ధర CNY 7,999, 16GB + 512GB మోడల్ ధర CNY 8,999, 16GB + 1TB మోడల్ ధర CNY 9,999కు అందిస్తుంది.
ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. బ్లాక్, వైట్, ఐస్ పీచ్ పింక్, స్టార్రీ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అదే సమయంలో ట్రాన్స్పరెంట్ స్పెషల్ ఎడిషన్ కూడా అందిస్తుంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో లాంచ్ సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కంపెనీ షావోమీ 18 ప్రో మోడల్ కూడా అందిస్తుంది.
షావోమీ 18 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు :
షావోమీ 18 ప్రో మ్యాక్స్ 1,208 x 2,624 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల ఫుల్-HD+ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్, హార్డ్‌వేర్-లెవల్ ప్రైవసీ డిస్ప్లేకు సపోర్టు ఇస్తుంది. స్క్రీన్ వ్యూ యాంగిల్ లిమిట్ అందిస్తుంది. తద్వారా దగ్గరలో కూర్చున్న వ్యక్తులు డిస్ప్లే చూడటం కష్టమే..
Read Also : itel ACE 4 Shine : సూపర్ ఫోన్ భయ్యా.. జస్ట్ రూ. 1059కే కొత్త ఫీచర్ ఫోన్.. 9 భాషలకు సపోర్టు..!
బ్యాక్ సైడ్ 2.9-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది. షావోమీ ఈ ఏఐ బ్యాక్ స్క్రీన్ గతంలో కన్నా అద్భుతంగా ఉంటుంది. నోటిఫికేషన్లు, స్మాల్ టూల్స్‌తో పాటు, ఏఐ జనరేటెడ్ వాల్పేపర్లు, స్పెషల్ యాప్ కార్డ్‌లు వంటి ఆప్షన్లను కూడా అందిస్తుంది.
షావోమీ 18 ప్రో మ్యాక్స్‌లో 2nm టెక్నాలజీతో కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌ను అమర్చారు. 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత HyperOS4పై రన్ అవుతుంది. కంపెనీ కొత్త జీపీయూ, మెరుగైన కూలింగ్ సిస్టమ్‌తో హై పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. :
ఈ ఫోన్లో 3 రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో OISతో 200MP ప్రైమరీ కెమెరా, OISతో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ టెలిఫోటో కెమెరా ఆప్టికల్ జూమ్, మాక్రో ఫోటోగ్రఫీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ 8K వరకు వీడియోను రికార్డ్ చేయగలదు. కాగా, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.
పవర్ కోసం.. షావోమీ 18 ప్రో మ్యాక్స్‌లో 8,500mAh బ్యాటరీ ఉంది. 100W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, USB టైప్-సి ఉన్నాయి.
