Flipkart Freedom Sale 2026 : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఈ TCL టీవీ చాలా చీప్ గురూ.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు!
Flipkart Freedom Sale 2026 : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. ఈ కొత్త టీసీఎల్ టీవీ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఏకంగా రూ. 16వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Flipkart Freedom Sale 2026
- ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో టీసీఎల్ టీ6డీ భారీ తగ్గింపుతో లభిస్తుంది
- బ్యాంకు ఆఫర్లతో ధర మరింత తగ్గింపు పొందవచ్చు
- ఈ టీవీ 4K పిక్చర్ క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లు, డాల్బీ సపోర్ట్
Flipkart Freedom Sale 2026 : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది. ఈ లిమిటెడ్ టైమ్ సేల్ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, ఫ్యాషన్, స్మార్ట్ గాడ్జెట్లపై అదిరిపోయే భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అనేక టీవీలు ధర తగ్గింపుతో లభిస్తున్నాయి. మీ పాత టీవీని అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం టీసీఎల్ టీ6డీ రూ. 35వేల కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది.
కొనుగోలుదారులు బ్యాంక్ కార్డు ఆఫర్లతో ఇంకా తగ్గింపు పొందవచ్చు. డిస్కౌంట్లు, ఆఫర్లతో సహా ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart Freedom Sale 2026) టీసీఎల్ టీ6డీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మీరు కొత్త టీవీ కొనేందుకు చూస్తుంటే ఈ సేల్ ముగిసేలోగా సొంతం చేసుకోండి.
టీసీఎల్ టీ6డీ ఫ్లిప్‌కార్ట్ డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో టీసీఎల్ టీ6డీ కేవలం రూ. 32,990కే లభిస్తోంది. అసలు ధర రూ. 48,990 కాగా రూ. 16వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్లు అదనంగా రూ. 4,062 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ అసలు ధర రూ. 28,928కి తగ్గుతుంది.
పాత టీవీ నుంచి అప్‌గ్రేడ్ కోసం కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ బెనిఫిట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ చేసే డివైజ్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 4,150 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఈఎంఐతో చెల్లించేవారికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 6 నెలలకు రూ. 5,040 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.
టీసీఎల్ టీ6డీ కొనాలా? వద్దా? :
ప్రస్తుత ధరకు మీకు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD డిస్ప్లే టీవీ లభిస్తుంది. అలాగే, ఈ టీవీ 3840 × 2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. DCI-P3 కలర్ గామట్ QLED టెక్నాలజీతో వస్తుంది.
పిక్చర్ ప్రాసెసింగ్ కోసం.. ఈ టీవీకి టీసీఎల్ AiPQ ఇంజిన్ పవర్ అందిస్తుంది. ఇందులో కాంట్రాస్ట్, కలర్, క్లారిటీ టెక్నాలజీ ఉన్నాయి. అంతేకాదు.. కంటెంట్ కోసం డాల్బీ విజన్ HDR10+కు కూడా సపోర్టు ఇస్తుంది.
స్మార్ట్ టీవీల విషయానికి వస్తే..
టీసీఎల్ టీ6డీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 16GB స్టోరేజ్, 2GB ర్యామ్‌తో వస్తుంది. అంతేకాదు.. వాయిస్ ఆధారిత కంట్రోలింగ్ కోసం ఇందులో ఇంటర్నల్ గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. ఈ టీవీ డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. ఈ 43-అంగుళాల మోడల్ 24W వరకు ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
మీకు HDMI eARC సపోర్ట్‌తో సహా 3 HDMI పోర్ట్‌లు, అలాగే సింగిల్ యూఎస్బీ పోర్ట్ లభిస్తాయి. వైర్లెస్ కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ టీవీ 2.4GHz, 5GHz నెట్‌వర్క్‌లలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి, అలాగే స్క్రీన్ సైజును బట్టి బ్లూటూత్ 5.2 లేదా 5.4కి సపోర్ట్ చేస్తుంది.
