Reliance Jio world's cheapest 5g smartphone ( Image Source : Google )
Reliance Jio 5G Phone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి సరికొత్త చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. టెలికాం కంపెనీలలో జియోనే టాప్ కంపెనీ. జియో తమ యూజర్ల కోసం సరసమైన, చాలా చౌకైన ప్లాన్‌లను అందిస్తుంది. భారత టెలికం మార్కెట్లో కోట్లాది మంది జియో సిమ్‌ని ఉపయోగిస్తున్నారు.
కంపెనీ ఇప్పుడు 5జీ సిమ్ సర్వీసుతో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇంకా ఫోన్‌ను ధృవీకరించనప్పటికీ, కొన్ని లీకైన అప్‌డేట్‌లు రాబోయే ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తున్నాయి. ఈ లీకైన అప్‌డేట్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
సింగిల్ ఛార్జ్‌తో 2 రోజుల బ్యాకప్ :
జియో 5జీ ఫోన్ 5000ఎంఎహెచ్, 128జీబీ స్టోరేజ్ పవర్‌ఫుల్ బ్యాటరీలను కలిగి ఉంది. నివేదికల ప్రకారం.. జియో ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో కెమెరా విషయానికి వస్తే.. 16ఎంపీ ప్రైమరీ కెమెరాను పొందవచ్చు. వీడియో కాలింగ్, సెల్ఫీలకు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. విశేషమేమిటంటే.. ఈ జియో ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ జియో ఫోన్ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జర్‌ని సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే ఈ డివైజ్‌ని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మొత్తం 2 రోజుల పాటు ఫోన్‌ను ఉపయోగించవచ్చు.
జియో చౌకైన 5జీ ఫోన్ :
రాబోయే జియో స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4కె క్వాలిటీ వీడియోలను ప్లే చేయవచ్చు. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఈ 5జీ ఫోన్‌ను చాలా తక్కువ ధరకే అందించనుంది. ఈ సరికొత్త డివైజ్ ధర రూ.3వేలు ఉంటుందని అంచనా.
ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయలేని వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ చౌకైన ఫోన్‌లో వినియోగదారులు ఖరీదైన ఫోన్‌లలో అనేక ఫీచర్లను పొందవచ్చు. అందుకే రాబోయే ఈ ఫోన్ కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో త్వరలో ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయాలని భావిస్తోంది.