Reliance Jio down : రిలయన్స్ జియో డౌన్.. మొబైల్ ఇంటర్నెట్, ఫైబర్ సర్వీసులకు తీవ్ర అంతరాయం.. యూజర్ల ఇబ్బందులు..!

Reliance Jio down : ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గణనీయమైన సంఖ్యలో వినియోగదారులు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటుండగా, కొంతమంది యూజర్లకు జియో ఇంటర్నెట్ సర్వీసులు బాగానే పనిచేస్తున్నాయని నివేదించారు.

Reliance Jio down_ Thousands of users ( Image Source : Google )

Reliance Jio down : దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సర్వీసులు స్తంభించాయి. జియో అందించే ప్రధాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. వేలాది మంది జియో కస్టమర్‌లు జియోఫైబర్, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులపై సమస్యలను నివేదించారు. రోజువారీ కార్యకలాపాల్లో గణనీయమైన అంతరాయాలకు దారితీసింది.

Read Also : AIS app for Taxpayers : ట్యాక్స్ పేయర్ల కోసం కొత్త ‘ఏఐఎస్’ యాప్.. ఇదేలా ఉపయోగించాలి? పూర్తివివరాలు మీకోసం..!

అయితే, గూగుల్ పబ్లిక్ డొమైన్ నేమ్ సిస్టమ్ (DNS) సర్వీసు కూడా డౌన్ అయింది. యూట్యూబ్, ట్విట్టర్ వంటి ఇతర సర్వీసులపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమస్య రిలయన్స్ జియో వైపు నుంచి కనిపించడం లేదు. గూగుల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లకు డీఎన్ఎస్ సర్వీసులను అందిస్తోంది.

ఆన్‌లైన్ సర్వీస్ అంతరాయాలను పర్యవేక్షించే ప్లాట్‌ఫారమ్ అయిన డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. జియో సర్వీసుల్లో అంతరాయం మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:41కి గరిష్టంగా, 2,300 మంది వినియోగదారులు కనెక్టివిటీ సమస్యలను నివేదించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:11 నాటికి, ఫిర్యాదులు కొద్దిగా తగ్గాయి. కానీ, కొద్దిసేపటి తర్వాత మళ్లీ పెరిగాయి. ఈ రోజు మధ్యాహ్నానికి 1,900 కన్నా ఎక్కువ నివేదికలు వచ్చాయి.

58శాతం జియోఫైబర్, 37శాతం మొబైల్ ఇంటర్నెట్ :
ప్రస్తుతానికి, 58 శాతం ఫిర్యాదులు జియోఫైబర్ సర్వీసులకు సంబంధించినవి కాగా, 37 శాతం మొబైల్ ఇంటర్నెట్ అంతరాయాలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ అంతరాయం చాలా మంది జియో సబ్‌స్క్రైబర్‌లను నిరాశకు గురి చేసింది. అనేక మంది ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు, కీలకమైన కమ్యూనికేషన్, జనరేటివ్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేయలేకపోయారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు యూజర్ల ఫిర్యాదులు, ప్రశ్నలతో నిండిపోయాయి. వ్యక్తిగత, వృత్తిపరమైన ఉపయోగం కోసం జియో సర్వీసుల గురించి ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గణనీయమైన సంఖ్యలో వినియోగదారులు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటుండగా, కొంతమంది యూజర్లకు జియో ఇంటర్నెట్ సర్వీసులు బాగానే పనిచేస్తున్నాయని నివేదించారు. విస్తృతమైన జియో సర్వీసులపై ప్రభావం ఉన్నప్పటికీ, రిలయన్స్ జియో అంతరాయానికి గల కారణం ఏంటి అనేది అధికారికంగా ప్రకటించలేదు.

Read Also : OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ వచ్చేస్తోంది.. ఈ నెల 24నే లాంచ్.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే!