OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ వచ్చేస్తోంది.. ఈ నెల 24నే లాంచ్.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే!

OnePlus Nord CE 4 Lite 5G : రాబోయే వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ జూన్ 24న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ కొత్త వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ గత వెర్షన్ పోలిస్తే ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్, మెరుగైన ఫొటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది. 

OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ వచ్చేస్తోంది.. ఈ నెల 24నే లాంచ్.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే!

OnePlus Nord CE 4 Lite India launch on June 24 ( Image Source : Google )

Updated On : June 18, 2024 / 9:55 PM IST

OnePlus Nord CE 4 Lite 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ ఎట్టకేలకు వస్తోంది. కంపెనీ ఈ 5జీ ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించింది. లాంచ్ ఈవెంట్‌కు ముందు కొన్ని స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించింది. రాబోయే వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ జూన్ 24న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ కొత్త వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ గత వెర్షన్ పోలిస్తే ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్, మెరుగైన ఫొటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది.

Read Also : Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ చూశారా? ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ అనేది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్-లెవల్ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్‌లు, డిస్‌ప్లే క్వాలిటీ, ఫొటోగ్రఫీని అందిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌కు లైట్ 5జీతో ప్రత్యేకంగా నిలుస్తుందని వన్‌ప్లస్ ప్రెసిడెంట్ సీఓఓ కిండర్ లియు చెప్పారు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా అనేక మార్పులను వెల్లడించింది. పిల్ ఆకారపు కెమెరా మాడ్యూల్‌పై చిన్న కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంటుంది. బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కొత్త బ్లూ కలర్ మోడల్‌లో వన్‌ప్లస్ ప్రవేశపెట్టింది.

లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు లీక్ :
లాంచ్ ఈవెంట్‌కు ముందు.. కంపెనీ కొన్ని స్పెసిఫికేషన్‌లను కూడా ధృవీకరించింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీని ప్యాక్ చేసింది. వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే ఆక్వా టచ్ టెక్‌తో 120Hz అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్వా టచ్ అంటే.. మీ చేతులు తడిగా ఉన్నప్పటికీ ఫోన్ స్క్రీన్ సరిగ్గా పని చేస్తూనే ఉంటుంది. స్క్రీన్ 2,100నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. 5డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్‌తో కూడా వస్తుంది. మిగతా వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.

లీక్‌ల ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో పనిచేసే 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉండవచ్చు. ఇతర సెన్సార్ల వివరాలు ప్రస్తుతానికి తెలియవు. ముందు భాగంలో 16ఎంపీ కెమెరా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రూ. 25వేల ధరల విభాగంలోకి వస్తుంది. ఈ ఫోన్ లైట్ వెర్షన్ గత వెర్షన్ల మాదిరిగానే రూ. 20వేల లోపు ధర ఉంటుందని అంచనా. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ప్రారంభ ధర రూ. 19,999, ప్రస్తుతం అమెజాన్ ద్వారా రూ. 17,499 తక్కువ ధరకు విక్రయిస్తోంది.

Read Also : AIS app for Taxpayers : ట్యాక్స్ పేయర్ల కోసం కొత్త ‘ఏఐఎస్’ యాప్.. ఇదేలా ఉపయోగించాలి? పూర్తివివరాలు మీకోసం..!