Reliance Jio introduces new plan with 18GB extra data along with 14 OTT benefits
Reliance Jio New Plan : దేశంలోని ప్రముఖ టెలికాం ప్లేయర్‌లలో ఒకటైన రిలయన్స్ జియో అద్భుతమైన ప్లాన్ ప్రవేశపెట్టింది. కంపెనీ టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి వినియోగదారులకు చౌకైన సరసమైన ప్లాన్‌లను అందిస్తోంది. తాజాగా జియో 44 కోట్ల కన్నా ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది.
84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్‌తో పాటు అత్యంత సరసమైన ప్లాన్ రేంజ్‌లో గొప్ప ఆఫర్‌లను అందిస్తోంది. టెలికాం కంపెనీ అందించే ఈ ప్లాన్ గురించి పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జియో తన రీఛార్జ్ ప్లాన్‌లను అనేక కేటగిరీలుగా విభజించింది. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
రిలయన్స్ జియో నుంచి అనేక ప్లాన్‌లు ఓటీటీ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఉచిత ఓటీటీ బెనిఫిట్స్ అందించే రూ. 1,198 విలువైన కొత్త ప్లాన్ కూడా తీసుకొచ్చింది.
రూ. 1198 ప్లాన్ :
రిలయన్స్ జియో రూ. 1198 విలువైన ప్లాన్.. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. వినియోగదారులు 0 వ్యాలిడిటీతో ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచిత కాల్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ డేటా ప్రయోజనాల విషయానికి వస్తే.. వినియోగదారులు 84 రోజుల పాటు 168జీబీ డేటాను పొందవచ్చు. మీరు రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించవచ్చు. రోజువారీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత వినియోగదారులు 64కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ కస్టమర్లందరికీ రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది.
ప్లాన్‌లో ఓటీటీ బెనిఫిట్స్ వివరాలివే :
ఓటీటీ ఇష్టపడే వారి యూజర్ల కోసం ఈ ప్లాన్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌లతో 14 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో అందిస్తోంది. అందులో కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.