EPF Passbook Balance : మీ పీఎఫ్ అకౌంట్లో పాస్‌బుక్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

EPF Passbook Balance : మీరు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేటు ఉద్యోగం అయినా కంపెనీలో హెచ్ఆర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతినెలా పీఎఫ్ సొమ్ము క్రెడిట్ అయ్యే అకౌంట్ వివరాలను తీసుకోండి. పీఎఫ్ అకౌంట్ నెంబర్, యూఏఎన్ నెంబర్ తెలిసి ఉండాలి.

EPF Passbook Balance : మీ పీఎఫ్ అకౌంట్లో పాస్‌బుక్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

how to check EPF passbook balance online or via SMS, missed call

EPF Passbook Balance : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే, చాలామందికి పీఎఫ్ అకౌంట్ ఉన్నప్పటికీ పీఎఫ్ ఇప్పటివరకూ ఎంత బ్యాలెన్స్ క్రెడిట్ అయింది అనేది అవగాహన ఉండకపోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో కూడా తెలియదు. మరికొంతమందికి కనీసం యూఏఎన్ నెంబర్ అంటే ఏంటో కూడా తెలియకపోవచ్చు.

మరి.. పీఎఫ్ అకౌంట్ ఏంటి? యూఏఎన్ తెలుసుకోవాలంటే.. మీరు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేటు ఉద్యోగం అయినా కంపెనీలో హెచ్ఆర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. మీకు ప్రతినెలా పీఎఫ్ సొమ్ము క్రెడిట్ అయ్యే అకౌంట్ గురించి అడిగి వివరాలను తీసుకోండి. ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్ నెంబర్, యూఏఎన్ నెంబర్ తెలిసి ఉండాలి.

Read Also : EPFO Aadhaar Card : ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డు పనికిరాదు.. వ్యాలీడ్ డాక్యుమెంట్లు ఇవే..!

మీరు చేయాల్సిందిల్లా.. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలి. ముందుగా మీ పీఎఫ్ అకౌంటుతో యూఏఎన్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఆ తర్వాత యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యూఏఎన్ నెంబర్, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వివరాలను సమర్పించాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. వచ్చిన ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే కొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్లో యూఏఎన్ నెంబర్ ఉపయోగించి కొత్త పాస్‌వర్డుతో లాగిన్ చేయాలి. మీకు పాస్ బుక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ :
పీఎఫ్ ఖాతాదారులు ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేయొచ్చు. తమ అకౌంట్ గురించి లేటెస్ట్ వివరాలను పొందడానికి ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపవచ్చు. ఎస్ఎంఎస్ పంపడానికి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి, 7738299899కి ఎస్ఎంఎస్ పంపండి. డిఫాల్ట్ లాంగ్వేజీ ఇంగ్లీష్ ఉంటుందని గమనించాలి.

మిస్డ్ కాల్ :

  • మిస్డ్ కాల్ సౌకర్యం ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేయొచ్చు.
  • ఖాతాదారులు 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • పీఎఫ్ బ్యాలెన్స్‌తో పాటు చివరి కాంట్రిబ్యూషన్ వివరాలను కూడా అందుకోవచ్చు.
  • యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ అయి ఉండాలి.
  • ఖాతాదారుల మొబైల్ నంబర్‌ను యూఏఎన్‌తో రిజిస్టర్ అయి ఉండాలి.
  • పీఎఫ్ మెంబర్ యూఏఎన్ ఆధార్ కార్డ్, పాన్, బ్యాంక్ అకౌంట్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లతో సీడ్ చేసి ఉండాలి.

ఆన్‌లైన్ మోడ్ ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉమాంగ్ యాప్ ఎలా పనిచేస్తుందంటే? :
ఉమాంగ్ అనేది వివిధ సర్వీసుల కోసం వినియోగించే కేంద్రీకృత ప్రభుత్వ అప్లికేషన్. వినియోగదారుని యూఏఎన్ నెంబర్‌ను ఓటీపీని ఉపయోగించి యాప్‌కి లాగిన్ చేయొచ్చు. తద్వారా పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు. ఈపీఎఫ్ పాస్‌బుక్‌ని కూడా పొందవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని ఇలా చెక్ చేసుకోవచ్చు.

  • ప్లేస్టోర్/యాప్ స్టోర్ ద్వారా (UMANG) యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి
  • మొబైల్ నంబర్ వెరిఫై చేసి రిజిస్టర్ చేసుకోండి.
  • దిగువన అందుబాటులో ఉన్న ‘All Services’ ఆప్షన్ క్లిక్ చేయండి
  • ఈ జాబితా నుంచి ఈపీఎఫ్ఓ ఆప్షన్ కోసం ఎంచుకోండి
  • ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి వ్యూ పాస్‌బుక్‌ (View Passbook)పై క్లిక్ చేయండి
  • యూఏఎన్ ఎంటర్ చేసి (Get OTP) ఆప్షన్ క్లిక్ చేయండి.
  • మీ వివరాలను చెక్ చేయడానికి మీ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ చేయండి

ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి :

  • అధికారిక వెబ్‌సైట్‌ (www.epfindia.gov.in)ను విజిట్ చేయండి.
  • ‘My Services’ లిస్టు నుంచి ‘For Employees’ ఆప్షన్ క్లిక్ చేయండి
  • ఆపై ‘Members Passbook’పై క్లిక్ చేయండి
  • ఖాతాదారు లాగిన్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది
  • UAN వివరాలు, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయండి
  • బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల్సిన ఈపీఎఫ్ ఖాతాలోని ‘Member ID’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

Read Also : EPFO Interest Rate : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25 శాతానికి పెంపు.. మూడేళ్లలో ఇదే గరిష్టం!