EPFO Interest Rate : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25 శాతానికి పెంపు.. మూడేళ్లలో ఇదే గరిష్టం!

EPFO Interest Rate : పీఎఫ్ చందదారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. గత మూడేళ్లలో ఇదే గరిష్టం. ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును 2021-22లో 8.10 శాతం నుంచి 2022-23కి 8.15 శాతానికి పెంచింది.

EPFO Interest Rate : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25 శాతానికి పెంపు.. మూడేళ్లలో ఇదే గరిష్టం!

EPFO fixes 3-year high 8.25 percent interest rate on employees provident fund

EPFO Interest Rate : ఈపీఎఫ్ చందదారులకు అదిరే వార్త.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2023-24కి సంబంధించి వడ్డీరేట్లను ప్రకటించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై 8.25 శాతం వడ్డీ రేట్లను నిర్ణయించింది. ఈ మేరకు పీటీపీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : EPFO Aadhaar Card : ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డు పనికిరాదు.. వ్యాలీడ్ డాక్యుమెంట్లు ఇవే..!

ఈపీఎఫ్ వడ్డీ రేటును 8 శాతానికి తగ్గిస్తారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ వడ్డీరేటును మాత్రం 8.25 శాతంగా నిర్ణయించినట్టు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. అయితే, మార్చి 2023లో, ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును 2021-22లో 8.10 శాతంతో పోలిస్తే.. 2022-23కి కొద్దిగా 8.15 శాతానికి పెంచింది. అయితే అంతకుముందు మార్చి 2022లో 2021-22కి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించింది.

ఆరు కోట్ల మంది ఖాతాల్లోకి ఎప్పుడంటే? :
1977-78 నుంచి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉన్నప్పటి నుంచి ఇది చాలా తక్కువనే చెప్పాలి. ‘2023-24కి ఈపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీని అందించాలని (CBT) నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీటీ నిర్ణయాన్ని అనుసరించి 2023-24 ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వడ్డీ రేట్లు రాబోయే రోజుల్లో 6 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ఓ ​​చందాదారుల ఖాతాల్లో జమ కానుంది.

EPFO fixes 3-year high 8.25 percent interest rate on employees provident fund

EPFO interest rate  

ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంతంటే? :
మార్చి 2020లో ఈపీఎఫ్ఓ ​​ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19లో 8.65 శాతం నుంచి 2019-20కి ఏడేళ్ల కనిష్ట స్థాయి 8.5 శాతానికి తగ్గించింది. గత సంవత్సరాల్లో, ఈపీఎఫ్ఓ ​​వడ్డీ రేట్లు 2015-16లో 8.8 శాతం, 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతానికి తగ్గింది. రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ 2013-14, 2014-15లో 8.75 శాతం అధిక వడ్డీని అందించింది. 2012-13కి 8.5 శాతంగా ఉంది. అయితే, 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది.

Read Also : Paytm Pai Platforms : పేటీఎం పేరు మారిపోయిందిగా.. ఇకపై ఆ సర్వీసులన్నీ ఈ పేరుతోనే..!