Paytm Pai Platforms : పేటీఎం పేరు మారిపోయిందిగా.. ఇకపై ఆ సర్వీసులన్నీ ఈ పేరుతోనే..!
Paytm Pai Platforms : పేటీఎం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం పేరును మార్చేసింది. ఇప్పటినుంచి పై ప్లాట్‌ఫారమ్ సర్వీసులను అందించనుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Paytm e-commerce changes its name to Pai Platforms
Paytm Pai Platforms : భారత రిజర్వ్ బ్యాంకు (RBI) దెబ్బకు పేటీఎం సంక్షోభంలో పడింది. ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం నుంచి అనేక సంస్థలు దూరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ల వినియోగాన్ని నిలిపివేశాయి. ఈ క్రమంలోనే పేటీఎం తన సర్వీసుల్లో ఒకటైన పేటీఎం ఈ-కామర్స్ సర్వీసు పేరు మార్చేసింది. పై ప్లాట్‌ఫారమ్స్ (Pai Platforms) అనే కొత్త పేరుతో రిజిస్టర్ చేసుకుంది.
అంతేకాదు.. ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారంలో వాటాను పొందే (ONDC)లో విక్రేత ప్లాట్‌ఫారమ్ అయిన (Bitsila)ను కూడా పేటీఎం కొనుగోలు చేసింది. సంబంధిత వర్గాల ప్రకారం.. కంపెనీ మూడు నెలల క్రితమే ఈ కొత్త పేరు మార్పు కోసం దరఖాస్తు చేసింది. ఈ నెల (ఫిబ్రవరి 8న) కంపెనీల రిజిస్ట్రార్ నుంచి అనుమతి పొందింది. దాంతో కంపెనీ పేరు పేటీఎం ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పై ప్లాట్‌ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Pai Platforms Private Limited)గా మార్చుకుంది. ఈ సర్టిఫికేట్ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
బిట్సాలాను కొనుగోలు చేసిన పేటీఎం :
కంపెనీ వాస్తవానికి పేటీఎం ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విలీనం అయిందని ఫిబ్రవరి 8న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేటీఎం ఇ-కామర్స్‌లో ఎలివేషన్ క్యాపిటల్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. దీనికి పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, సాఫ్ట్‌బ్యాంక్, (eBay) సపోర్టు కూడా ఉంది.

Paytm e-commerce Pai Platforms
2020లో ప్రారంభమైన ఇన్నోబిట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Bitsila)ని కంపెనీ ఇప్పుడు కొనుగోలు చేసింది. పూర్తి-స్టాక్ ఓమ్నిచానెల్, హైపర్‌లోకల్ కామర్స్ సామర్థ్యంతో (ONDC) విక్రేత ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పై ప్లాట్‌ఫారమ్‌లు ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో ప్రముఖ కొనుగోలుదారుల ప్లాట్‌ఫారమ్ బిట్‌సిలా కొనుగోలుతో దాని వాణిజ్యపరంగా మరింత బలంగా మారుతుందని తెలిపాయి.
30కన్నా ఎక్కువ నగరాల్లో సేవలు :
2020లో బిట్సిలా ప్రారంభం కాగా.. ఓఎన్‌డీసీలో మొదటి మూడు విక్రయదారుల ప్లాట్‌ఫారమ్‌లలో ఇదొకటి. ఓఎన్‌డీసీలో మెక్‌డొనాల్డ్స్, బిగ్‌బాస్కెట్ వంటి మార్క్యూ బ్రాండ్‌లకు సపోర్టు ఇస్తుంది. బిట్సిలా ఫుల్-స్టాక్ ఓమ్నిచానెల్, హైపర్‌లోకల్ కామర్స్ సామర్థ్యాలు దీని వృద్ధికి ఆజ్యం పోశాయి. 30 కన్నా ఎక్కువ నగరాల్లోని 10వేల స్టోర్‌లలో 600 మిలియన్లకు పైగా ఉత్పత్తులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాదు.. ఈ ప్లాట్‌ఫారమ్ కిరాణా, ఆహారం, పానీయాలు, ఫ్యాషన్, అందం, వ్యక్తిగత సంరక్షణ (BPC), గృహాలంకరణతో సహా వివిధ రంగాల్లో సేవలను అందిస్తుంది.