Reliance Jio Plans : రిలయన్స్ జియో 2 కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 5G డేటా బెనిఫిట్స్ మీకోసం.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Reliance Jio Plans : రిలయన్స్ జియో ఇటీవల కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రోజువారీ డేటా క్యాప్ తర్వాత త్వరగా ఇంటర్నెట్ డేటా పొందవచ్చు.

Reliance Jio introduces two new recharge plans with 5G data benefits_ check details

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్ల కోసం సరికొత్త మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇటీవలే రోజువారీ హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్యాక్ కోరుకునే యూజర్ల కోసం టెల్కో రెండు కొత్త ప్రీపెయిడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌లను చేర్చింది. అందులో రూ. 19, రూ. 29 ధరతో కొత్త డేటా బూస్టర్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ప్రస్తుత జియో ప్లాన్‌ల జాబితాలో ఈ రెండు ప్లాన్లు అందిస్తోంది. ప్రస్తుత రీఛార్జ్ ప్యాక్‌కి అదనపు డేటాను పొందవచ్చు. జియో కొత్త డేటా రీఛార్జ్ ప్లాన్‌ల కింద అందించే ఆఫర్‌లను వివరంగా పరిశీలిద్దాం.

జియో రూ.19 డేటా బూస్టర్ ప్లాన్ :
రూ. 19 ధరతో, Jio నుంచి ఈ ప్రీపెయిడ్ డేటా బూస్టర్ ప్లాన్ యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌కు టాప్-అప్‌గా 1.5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ డేటా బూస్టర్ ప్లాన్‌ల బెనిఫిట్స్ పొందాలంటే.. యూజర్లు కనెక్షన్‌లో రెగ్యులర్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ యాక్టివ్‌గా ఉండాలి.

Read Also : Pixel 8 Series Price Leak : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర లీక్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

జియో రూ.29 డేటా బూస్టర్ ప్లాన్ :
2.5GB డేటా ఆఫర్‌తో ఈ ప్లాన్ యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌కి ఇంటర్నెట్ టాప్-అప్‌ను కూడా అందిస్తుంది. సాధారణ రీఛార్జ్ ప్లాన్ రోజువారీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత డేటా ప్యాక్ యాక్టివ్ అవుతుంది. ముఖ్యంగా, జియో యూజర్లు (Jio 5G) నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయితే.. రెండు డేటా బూస్టర్‌లు 5G డేటా వేగాన్ని అందిస్తాయి. జియో యూజర్లు (My Jio) యాప్‌ని విజిట్ చేయడం ద్వారా లేదా ఇతర సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా డేటా బూస్టర్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు మరిన్ని ఆప్షన్ల కోసం చూస్తుంటే.. వినియోగదారులు రూ. 15 నుంచి రూ. 222 వరకు ప్లాన్లను ఎంచుకోవచ్చు. జియో ఇప్పటికే 7 డేటా బూస్టర్ ప్లాన్‌లను అందిస్తుంది. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు.

Reliance Jio Plans introduces two new recharge plans with 5G data benefits 

ఇటీవలి లాంచ్‌లో జియో ప్రత్యర్థి వొడాఫోన్-ఐడియా కూడా కొత్త డేటా ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. టెలికాం ఆపరేటర్ ఒక గంట లేదా ఒక రోజు ఇంటర్నెట్ పొందాలనుకునే యూజర్ల కోసం సూపర్ డే, సూపర్ అవర్ డేటా ప్యాక్‌లను రిలీజ్ చేసింది. సూపర్ అవర్ ప్యాక్ ధర రూ. 24, ఒక గంట పాటు అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. (SuperDay) ప్యాక్ ధర రూ. 49, 24 గంటల వ్యాలిడిటీతో 6GB డేటా బెనిఫిట్స్ అందిస్తుంది.

దేశంలో డిజిటల్ వృద్ధిని వేగవంతం చేసేందుకు జియో ఇటీవల (JioBharat) ఫోన్‌ను ప్రారంభించింది. రిలయన్స్ జియో భారత మార్కెట్లో ఇంటర్నెట్ సదుపాయం, ఇతర ఫీచర్లతో సరసమైన 4G ఫోన్ అయిన (JioBharat)ను ప్రవేశపెట్టింది. రూ. 999 ధర కలిగిన ఈ జియో 2G ఫోన్‌ యూజర్లను 4G నెట్‌వర్క్‌కి మారేలా ప్రోత్సహిస్తోంది. జియోఫోన్‌తో టెలికాం ఆపరేటర్ కూడా (JioBharat) యూజర్ల కోసం మాత్రమే ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ. 123 నుంచి ప్రారంభమవుతుంది. జియోభారత్ ప్లాన్‌లు సాధారణ ఇంటర్నెట్ ప్లాన్‌ల కన్నా మరింత సరసమైనవిగా చెప్పవచ్చు.

Read Also : Tata iphones Maker : భారత్‌లో ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూపు.. ఆ డీల్ పూర్తయితే.. ఫస్ట్ ఇండియన్ ఐఫోన్ మేకర్ టాటానే..!

ట్రెండింగ్ వార్తలు