Tata iphones Maker : భారత్‌లో ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్.. ఆ డీల్ పూర్తయితే.. ఫస్ట్ ఇండియన్ ఐఫోన్ మేకర్ టాటానే..!

Tata iphones Maker : కర్ణాటకలోని విస్ట్రోన్ ఫ్యాక్టరీ విలువ 600 మిలియన్ డాలర్లు (రూ. 4000 కోట్లకుపైగా) ఉంటుంది. లేటెస్ట్-జెన్ ఐఫోన్ 14ని అసెంబుల్ చేసే 10వేల మంది కార్మికులు ఉన్నారు.

Tata iphones Maker : భారత్‌లో ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్.. ఆ డీల్ పూర్తయితే.. ఫస్ట్ ఇండియన్ ఐఫోన్ మేకర్ టాటానే..!

Tata set to be first Indian firm to manufacture iPhones in India as Wistron factory deal nears

Tata iphones Maker : భారతీయ మొదటి ఐఫోన్ తయారీ సంస్థగా టాటా గ్రూప్ (Tata Group) అవతరించనుంది. కర్ణాటకలోని తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కార్ప్ ఫ్యాక్టరీ (Wistron Factory)లోని ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ గతకొంతకాలంగా చర్చలు జరుపుతోంది. ఈ రెండు కంపెనీల మధ్య డీల్ ఆగస్టులో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ డీల్ గానీ పూర్తయితే దేశంలో ఐఫోన్‌లను తయారు చేసే ఫస్ట్ భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ అవతరించనుంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రెండు కంపెనీలు డీల్‌కు దగ్గరగా ఉన్నాయి. ఆగస్టు నాటికి అధికారికంగా పూర్తయ్యే అవకాశం ఉంది. విస్ట్రోన్ ఐఫోన్ 14 మోడళ్లను కర్ణాటకలో అసెంబుల్ చేస్తుంది. ఈ డీల్ ఖరారైన తర్వాత టాటా గ్రూప్ పర్యవేక్షించనుంది. టాటా డీల్ హార్డ్‌వేర్ తయారీ విభాగంలో భారత ఖ్యాతిని మరింత పెంచనుంది. కేంద్ర ప్రభుత్వం మేడ్-ఇన్-ఇండియా (Made in India)లో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం కూడా ఇదే అని చెప్పవచ్చు.

Read Also : Pixel 8 Series Price Leak : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర లీక్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

కర్ణాటకలోని విస్ట్రాన్ ఫ్యాక్టరీ విలువ 600 మిలియన్ డాలర్లు (రూ. 4000 కోట్లకు పైగా) ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ సదుపాయం 10వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. లేటెస్ట్ జనరేషన్ ఆపిల్ ఐఫోన్ 14ను సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ల షిప్పింగ్ చేసేందుకు తైవాన్ తయారీదారు ఆపిల్‌కు కట్టుబడి ఉందని నివేదిక తెలిపింది. టాటా-విస్ట్రాన్ డీల్‌కు సంబంధించి మార్చి 2024 వరకు ఆర్థిక సంవత్సరంలో విస్ట్రోన్ ఐఫోన్ తయారీదారుతో డీల్ కుదుర్చుకుంది.

వచ్చే ఏడాది నాటికి ఫ్యాక్టరీ ప్లాంట్‌లోని శ్రామిక శక్తిని 3 రెట్లు పెంచాలని యోచిస్తోంది. ఈ డీల్స్ పూర్తి చేసేందుకు టాటా అంగీకరించినట్లు సమాచారం. విస్ట్రాన్ (Wistron) మాత్రమే కాకుండా.. ఆపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ SEలతో సహా ఎంపిక చేసిన ఐఫోన్ల మోడల్‌లను Foxconn Technology Group, Pegatron Corp వంటి తైవానీస్ సరఫరాదారుల ద్వారా భారత్‌లో అసెంబుల్ చేస్తోంది.

Tata set to be first Indian firm to manufacture iPhones in India as Wistron factory deal nears

Tata set to be first Indian firm to manufacture iPhones in India as Wistron factory deal nears

అనేక టెక్ కంపెనీలు తమ ప్రీమియం డివైజ్‌ల అసెంబ్లింగ్ కోసం చైనా తరహా దేశాలను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలోనే విస్ట్రాన్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునేందుకు టాటా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆపిల్ ఇప్పటికే మరో తయారీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేపట్టింది. ఆపిల్ ఐఫోన్ ప్రొడక్టు సామర్థ్యాన్ని 2023 నాటికి 7 శాతం నుంచి 2025 నాటికి 18 శాతానికి పెంచుతుందని గత నెలలో నివేదిక పేర్కొంది. దేశంలో ఐఫోన్ల వంటి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపైప్రోత్సాహించేందుకు భారత ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలను అందిస్తోంది. దేశంలో ఫ్యాక్టరీలను స్థాపించడానికి ఇతర స్మార్ట్‌ఫోన్ ప్లేయర్‌లను కూడా భారత్ ఆకర్షిస్తోంది.

ఇప్పటికే సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. (Xiaomi), Vivoతో సహా అనేక చైనీస్ బ్రాండ్‌లు తమ డివైజ్‌లను దేశంలో సమీకరించాయి. ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెలల్లో దేశం నుంచి అనేక స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 128 శాతం గణనీయమైన వృద్ధిని సాధించాయని భారతీయ టాప్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ విభాగం ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) గత నెలలో IANSకి తెలిపింది.

మేలో దేశ మార్కెట్లో రూ.12వేల కోట్ల విలువైన ఫోన్‌లను ఎగుమతి చేసింది. దేశంలో ఐఫోన్ ఎగుమతులు రూ.10వేల కోట్లకు చేరాయి. టాటా మాత్రమే కాదు.. భారతీయ మైనింగ్ దిగ్గజం వేదాంత కూడా దేశంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పుడు ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్‌తో కంపెనీ చర్చలు జరుపుతోంది. అయితే, వేదాంతతో జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ వైదొలగడంతో డీల్ నిలిచిపోయింది.

Read Also : Hyundai Exter SUV Variant : హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త SUV వేరియంట్ ధరలు ఇవే.. ఏ వేరియంట్ ధర ఎంతో తెలుసా?