Hyundai Exter SUV Variant : హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త SUV వేరియంట్ ధరలు ఇవే.. ఏ వేరియంట్ ధర ఎంతో తెలుసా?

Hyundai Exter SUV Variant : హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇప్పుడు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్త SUV ధరలు, ప్రతి వేరియంట్ కోసం ఎంత ధర చెల్లించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Hyundai Exter SUV Variant : హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త SUV వేరియంట్ ధరలు ఇవే.. ఏ వేరియంట్ ధర ఎంతో తెలుసా?

Hyundai Exter New SUV Variant-wise prices explained

Hyundai Exter SUV Variant : ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) అత్యంత సరసమైన SUV, ఎక్స్‌టర్‌ను రూ. 6 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లాంచ్ చేసింది. ఈ వెహికల్ ఐదు ట్రిమ్‌లను కలిగి ఉంది. అందులో పెట్రోల్, CNG ఇంధన ఆప్షన్లు, ఒక ఇంజన్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ ఉన్నాయి. ప్రస్తుతానికి, కంపెనీ ట్రిమ్, ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌ను బట్టి 11 వేరియంట్‌ల ధరలను వెల్లడించింది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ EX, S, SX, SX(O), SX(O) Connect మొత్తం 5 ట్రిమ్‌లలో వస్తుంది. హ్యుందాయ్ వెహికల్ వద్ద 1.2-లీటర్, 4-సిలిండర్, కప్పా పెట్రోల్ ఇంజన్ ఉంది. గరిష్టంగా 83PS శక్తిని, 113.8Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ లేదా 5-స్పీడ్ AMTతో పెయిర్ చేయవచ్చు. 5-స్పీడ్ MTతో CNG ఆప్షన్ (69PS, 95.2Nm) కూడా ఉంది.

Read Also : Maruti Suzuki Jimny Sales : కార్ల విక్రయాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి.. జూన్‌లో 3వేల యూనిట్లకు పైగా జిమ్నీ సేల్స్..!

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 పెట్రోల్ MT Exter పెట్రోల్ MT ధర బేస్ EX ట్రిమ్ ధర రూ. 6 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్-స్పెక్ SX(O) కనెక్ట్ ధర రూ. 9.32 లక్షల వరకు ఉంటుంది. ఇతర వేరియంట్‌ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

EX – రూ. 6 లక్షలు
S – రూ. 7.27 లక్షలు
SX – రూ 8 లక్షలు
SX(O) – రూ. 8.64 లక్షలు
SX(O) కనెక్ట్ – రూ. 9.32 లక్షలు

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 పెట్రోల్ AMT, EX ట్రిమ్‌తో AMT ఆప్షన్ పొందలేరు. AMT ఆప్షన్ S ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఎక్స్‌టర్ పెట్రోల్ AMT ఆప్షన్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

Hyundai Exter New SUV Variant-wise prices explained

Hyundai Exter New SUV Variant-wise prices explained

S – రూ. 7.97 లక్షలు
SX – రూ. 8.68 లక్షలు
SX(O) – రూ. 9.32 లక్షలు
SX(O) Connect – రూ. 10 లక్షలు
హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 CNG AMT

Exter CNG S, SX ట్రిమ్‌లలో మాత్రమే వస్తుంది. వాటి ధరలు ఈ కిందివిధంగా ఇలా ఉన్నాయి.
S – రూ. 8.24 లక్షలు
SX – రూ 8.97 లక్షలు
పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ మాత్రమేనని గమనించాలి.

హ్యుందాయ్ డ్యూయల్-టోన్ ఆప్షన్ల ధరలను వెల్లడించలేదు. అయినప్పటికీ, మోనోటోన్ కౌంటర్‌పార్ట్‌ల కన్నా రూ. 15వేల నుంచి 20వేలు ఎక్కువగా ఉంటుందని అంచనా.

Read Also : Hyundai Exter Launch : కొంటే ఇలాంటి కారు కొనాలి.. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 6 లక్షలు మాత్రమే.. త్వరపడండి..!