×
Ad

Reliance Jio : జియో కొత్త ప్లాన్ అదుర్స్.. యూట్యూబ్ ప్రీమియం, డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్.. నెలంతా ఎంజాయ్!

Reliance Jio : రిలయన్స్ జియో రూ. 500తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ అందిస్తోంది. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

Reliance Jio (Image Credit To Original Source)

  • జియో 28 రోజుల వ్యాలిడిటీ, రూ.500తో హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్రీపెయిడ్ ప్లాన్‌
  • ఈ ప్లాన్ రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, మొత్తం 56GB డేటా
  • యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తో మల్టీ OTT యాప్స్

Reliance Jio : మీరు జియో సిమ్ వాడుతున్నారా? మంత్లీ ప్లాన్ కోసం చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్.. రిలయన్స్ జియో ఇటీవల కేవలం రూ. 500కే స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. కంపెనీ ఈ ప్లాన్‌ను “హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్”గా అందిస్తోంది.

ఈ రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే నెలకు ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే కాకుండా, డేటా, కాలింగ్ బెనిఫిట్స్, అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీ యాక్సెస్‌ కూడా పొందవచ్చు. ఈ అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

జియో రూ.500 ప్లాన్ :
ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 500 ఉండగా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 56GB డేటాను అందిస్తుంది. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అదనపు ఛార్జీ లేకుండా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. మీరు ప్రతిరోజూ 100 SMS మెసేజ్ కూడా పొందవచ్చు. ఇంకా, ఈ ప్లాన్‌లో అనేక ఓటీటీ యాప్‌లకు కూడా ఫ్రీ సబ్ స్క్రిప్షన్లు కూడా ఉన్నాయి.

Reliance Jio  (Image Credit To Original Source)

OTT సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితం :
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా భారీగా OTT సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా పొందవచ్చు.

Read Also : 7 Seater Family SUVs : ఫ్యామిలీ కస్టమర్లకు పండగే.. హై పర్ఫార్మెన్స్‌తో 5 సరికొత్త 7 సీటర్ SUV మోడల్స్ వచ్చేస్తున్నాయ్..

  • యూట్యూబ్ ప్రీమియం
  • ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్
  • జియో హాట్‌స్టార్ (టీవీ/మొబైల్)
  • సోనీ LIV
  • జీ5
  • లయన్స్‌గేట్ ప్లే
  • డిస్కవరీ ప్లస్
  • సన్ ఎన్ఎక్స్‌టీ
  • కాంచా లంక (Kanchha Lannka)
  • ప్లానెట్ మరాఠీ
  • చౌపాల్
  • హోయిచోయ్
  • ఫ్యాన్ కోడ్
  • జియో టీవీ, జియోఏఐక్లౌడ్

ఈ ప్లాన్‌తో అన్ని ఓటీటీలను పూర్తిగా ఉచితంగా యాక్సస్ చేయొచ్చు. ఓటీటీ మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌తో కంపెనీ కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. కొత్త కనెక్షన్లలో జియోహోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్, JioAICloudలో 50GB స్టోరేజీ ఉన్నాయి. అదనంగా, ఈ ప్లాన్‌లో 18 నెలల ఫ్రీ గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా ఉంది.