Reliance Jio offers
Reliance Jio Offers : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త “అల్టిమేట్ 5జీ అప్‌గ్రేడ్ వోచర్”ను రూ. 601 ధరతో ప్రవేశపెట్టింది. ఏడాది మొత్తానికి అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తోంది. ఈ ప్రమోషనల్ ప్లాన్ రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లోని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 1.5జీబీ రోజువారీ డేటా కూడా పొందవచ్చు. ఈ 5జీ వోచర్‌తో, 5జీ ప్లాన్ లేని యూజర్లు కూడా సరసమైన ధరతో అన్‌లిమిటెడ్ 5జీ కనెక్టివిటీని ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.
గత జూలై 3న జియో టారిఫ్ పెంపును పెంచిన సంగతి తెలిసిందే. అన్‌లిమిటెడ్ 5జీ యాక్సెస్ పెంచింది. గతంలో, వినియోగదారులు జియో వెల్‌కమ్ ఆఫర్‌ను రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో యాక్టివేట్ చేయవచ్చు. పెంపు తర్వాత రూ. 349 ప్లాన్ వంటి 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ రోజువారీ డేటా కలిగిన ప్లాన్‌లకు అన్‌లిమిటెడ్ 5జీ బెనిఫిట్స్ పొందవచ్చు. జూలైలో ప్రవేశపెట్టిన కొత్త అప్‌గ్రేడ్ ప్లాన్‌లు 5జీ యేతర ప్లాన్‌లలోని వినియోగదారులకు కూడా అన్‌లిమిటెడ్ 5జీని అందిస్తాయి.
ఇందులో రూ. 51, రూ. 101, రూ. 151 ధర గల బూస్టర్ ప్యాక్‌లు ఉన్నాయి. ప్రతి ప్లాన్ అన్‌లిమిటెడ్ 5జీ యాక్సెస్‌తో పాటు అదనపు 4జీ డేటాను అందిస్తుంది. ఉదాహరణకు.. రూ.51 ప్లాన్‌లో 3జీబీ 4జీ డేటా, రూ.101 ప్లాన్‌లో 6జీబీ, రూ.151 ప్లాన్ 9జీబీని అందిస్తుంది. మైజియో యాప్‌లో రూ. 601 వోచర్‌ను ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా నేరుగా వోచర్ కొనుగోలు చేయవచ్చు. వెంటనే యాక్టివేట్ చేయొచ్చు. అయితే, వోచర్ రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
జియో సరసమైన ఆప్షన్లతో కూడిన ప్లాన్ కూడా ప్రవేశపెట్టింది. కొత్త రూ.11 ప్లాన్, గంట పాటు 10జీబీ డేటాను అందిస్తోంది. అత్యంత చౌకైనదిగా చెప్పవచ్చు. రూ. 49, రూ. 175, రూ. 219, రూ. 289, రూ. 359 ప్లాన్లలలో వాయిస్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లేవు. ఈ రియల్ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు జియో 5జీ యాక్సెస్ సరసమైన ధరకే అందిస్తున్నాయి. అదే సమయంలో వినియోగదారులకు పెద్దగా ఖర్చు లేకుండా కనెక్టివిటీని సులభంగా అందిస్తోంది.
Read Also : Indian Aviation History : భారతీయ విమానయాన సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో 5 లక్షల మంది ప్రయాణికులు..!