Indian Aviation History : భారతీయ విమానయాన సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో 5 లక్షల మంది ప్రయాణికులు..!

Indian Aviation History : ఈ నెల 17న దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజులో 5 లక్షల మంది దేశీయ ప్రయాణికులను తీసుకువెళ్లి చరిత్ర సృష్టించింది.

Indian Aviation History : భారతీయ విమానయాన సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో 5 లక్షల మంది ప్రయాణికులు..!

Indian aviation makes history

Updated On : November 18, 2024 / 9:50 PM IST

Indian Aviation History : భారతీయ విమానయాన రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ నెల 17న దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజులో 5 లక్షల మంది దేశీయ ప్రయాణికులను తీసుకువెళ్లి చరిత్ర సృష్టించింది. అన్ని విమానయాన సంస్థలు కలిసి 3173 దేశీయ ప్రయాణాల్లో 5,05,412 మంది దేశీయ ప్రయాణీకులను తీసుకువెళ్లాయి. గత రెండు వారాలుగా ఎయిర్ ట్రాఫిక్‌లో గరిష్ట స్థాయిలను కలిగి ఉంది. ఈ నెల 8న 4.9 లక్షల మంది ప్రయాణికులను నమోదు చేసింది.

నవంబర్ 9న 4.96 లక్షల మంది ప్రయాణికులను నివేదించింది. ఆ తర్వాత నవంబర్ 14, నవంబర్ 15 తేదీల్లో 4.97 లక్షలు, 4.99 లక్షల మంది ప్రయాణికులు, నవంబర్ 16 నాటికి 4.98 లక్షల మంది ప్రయాణికులతో చివరి మార్కును నమోదు చేశాయి. దేశీయంగా ఈ స్థాయిలో డిమాండ్‌కు అసలు కారణం.. పండుగలు, పెళ్లిళ్లుగా పలు నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే, వింటర్‌ సీజన్‌లో కూడా ఇదే జోరు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. దేశీయ విమానాలు 90 శాతం కన్నా హై-ఆక్యుపెన్సీతో నడిచాయి.

ఈ నెలలో విమానాల విస్తరణ సగటున రోజుకు 3161 వద్ద ఉంది. గత నెల కన్నా రోజుకు దాదాపు 8 విమానాలు ఎక్కువ అయితే, దీపావళి పండుగ రోజులలో ఎయిర్‌లైన్స్ డిప్లయ్ చేయగలిగే వాటి కన్నా తక్కువగా ఉంటుంది. నవంబర్ 12న ఎయిర్ ఇండియాతో విస్తారా విలీనం తర్వాత మెట్రో సెక్టార్‌ల మధ్య కొన్ని విమానాలు సంయుక్త సంస్థ ద్వారా డ్రీమ్‌లైనర్స్‌గా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఎయిర్‌లైన్ కొన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసిన సమయంలో ఈ ప్రయాణీకుల రద్దీ పెరిగింది.

Read Also : iPhone Storage Full : మీ ఐఫోన్ స్టోరేజీ ఫుల్ అయిందా? ఐఫోన్ నుంచి మ్యాక్, పీసీలకు ఫొటోలు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే?