Reliance Jio True 5G services now available in four districts of Andhra Pradesh, Check details here
Jio True 5G Services in Andhra Pradesh : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) దేశవ్యాప్తంగా తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు ప్రధాన నగరాల్లో జియో ట్రూ 5G సర్వీసుల (Jio True 5G Services In India)ను ప్రారంభించిన ముఖేశ్ అంబానీ టెల్కో కంపెనీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ తమ 5G సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ (Reliance Jio True 5G Services in Andhra Pradesh) జియో ట్రూ 5G సర్వీసులను ఆవిష్కరించింది. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో జియో 5G సర్వీసులను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.ఎస్. జవహర్ రెడ్డి విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో జియో ట్రూ 5G, జియో ట్రూ 5G పవర్డ్ Wi-Fi సర్వీసులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జియో కమ్యూనిటీ క్లినిక్ మెడికల్ కిట్, విప్లవాత్మక AR-VR డివైజ్ జియో గ్లాస్ ద్వారా వైద్యరంగంలో 5G అద్భుత ప్రయోజనాలను జియో ప్రదర్శించింది. ఈ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలలో అద్భుత మైన మార్పులు తీసుకొస్తాయని కంపెనీ పేర్కొంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో జియో ట్రూ 5G సేవలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఉన్న పెట్టుబడి రూ .26వేల కోట్లతో పాటు, అదనంగా ఏపీలో 5G నెట్ వర్క్‌ను ఏర్పాటుచేయడానికి జియో రూ .6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిందన్నారు.
Reliance Jio True 5G services now available in four districts of Andhra Pradesh
2023 డిసెంబర్ నాటికి ఏపీ రాష్ట్రమంతటా జియో 5G సర్వీసులు :
మన రాష్ట్ర అభివృద్ధి పట్ల వారి అపారమైన నిబద్ధతను చూపిస్తుందని మంత్రి కొనియాడారు. 2023 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అమర్ నాథ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. జియో ట్రూ 5G సేవల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్‌ను పొందడమే కాకుండా.. ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, SME వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలు పెరుగుతాయని ఆకాంక్షించారు. జియో ట్రూ 5G ద్వారా రాష్ట్ర పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు.
స్టార్టప్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జియో ట్రూ 5G సేవలతో IOT, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ &డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేస్తున్న స్టార్టప్‌లకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జియో ప్రతినిధి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో జియో ట్రూ 5Gని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జియో ట్రూ 5G నెట్‌వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పారు.
Reliance Jio True 5G services now available in four districts of Andhra Pradesh
జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి True-5G బెనిఫిట్స్ అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీని డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. డిసెంబర్ 26 నుంచి తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులోని జియో యూజర్లకు జియో వెల్‌కమ్ ఆఫర్ (Jio Welcome Offer) ఆహ్వానం అందుతుందని చెప్పారు. దీనిద్వారా జియో యూజర్లు అదనపు ఖర్చు లేకుండా 1Gbps+ స్పీడ్‌తో అన్ లిమిటెడ్ డేటాను పొందవచ్చునని అన్నారు.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ :
జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 4G LTE టెక్నాలజీతో ప్రపంచస్థాయి ALL-IP స్ట్రాంగ్ ఫ్యూచర్ ప్రూఫ్ నెట్ వర్క్‌ను నిర్మించింది. వారసత్వ మౌలిక సదుపాయాలు, దేశీయ 5G స్టాక్ లేకుండానే ఇప్పుడు 5G నెట్‌వర్క్ రెడీగా ఉంది. క్షేత్రస్థాయి నుంచే మొబైల్ వీడియో నెట్ వర్క్‌గా నిలిచిన ఏకైక నెట్ వర్క్ జియో అవతరించింది. టెక్నాలజీలో 6G, అంతకు మించి ముందుకు సాగుతున్నందున మరింత డేటాకు సపోర్టు చేసేందుకు సులభంగా అప్‌గ్రేడ్ చేయవచ్చు.
1.3 బిలియన్ల (130 కోట్ల) మంది భారతీయులకు డిజిటల్ ఇండియా దార్శనికతను అందించేందుకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థానం దిశగా నడిపించేందుకు జియో భారతీయ డిజిటల్ సేవల రంగంలో అపారమైన మార్పులను తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ జియో డిజిటల్ జీవితాన్ని గడపడేందుకు నెట్‌వర్క్, డివైజ్‌లు, అప్లకేషన్లు, కంటెంట్, సర్వీసుల అనుభవం, సరసమైన టారిఫ్‌లతో కూడిన వ్యవస్థను జియో క్రియేట్ చేసింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..