×
Ad

Jio Gemini AI 3 : జియో సర్‌ప్రైజ్ ఆఫర్.. రూ. 35,100 విలువైన Gemini AI 3 సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం.. వెంటనే ఇలా క్లెయిమ్ చేసుకోండి..!

Jio Gemini AI 3 : జియో యూజర్ల కోసం జెమిని AI 3 సబ్‌స్క్రిప్షన్‌ ఇప్పుడు ఉచితంగా పొందవచ్చు. ఎలా క్లెయిమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

Jio Gemini AI 3

Jio Gemini AI 3 : రిలయన్స్ జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. జెమిని AI 3 సబ్‌స్క్రిప్షన్‌ ఇప్పుడు ఫ్రీగా పొందవచ్చు. సాధారణంగా జెమిని AI 3 సబ్‌స్క్రిప్షన్‌ పొందాలంటే 18 నెలలకు రూ. 35,100 చెల్లించాలి. ఈ ఆఫర్‌ ఎంపిక చేసిన అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లపై మాత్రమే ఉచితంగా పొందవచ్చు. గూగుల్ ప్రీమియం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు. ప్రారంభంలో లిమిటెడ్ యాక్సస్ అందిస్తోంది.

వయస్సు వారీగా కంపెనీ దశలవారీగా (Jio Gemini AI 3) ఈ ఏఐ బెనిఫిట్స్ జియో యూజర్లందరికి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అద్భుతమైన ఆఫర్‌తో జియో యూజర్లు అదనపు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రైటింగ్, ఇమేజ్ క్రియేషన్, వీడియో జనరేషన్, క్లౌడ్ స్టోరేజ్ కోసం అడ్వాన్స్ ఏఐ టూల్స్ ట్రై చేయొచ్చు. ఈజీ వెరిఫికేషన్ ప్రక్రియతో మైజియో యాప్ ద్వారా ఆఫర్‌ను యాక్టివేట్ చేయవచ్చు.

ఫ్రీ జెమిని AI 3 సబ్‌స్క్రిప్షన్ :
గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌లో గూగుల్ లేటెస్ట్ జెమిని 3 మోడల్‌కు యాక్సెస్ అందిస్తుంది. లాంగ్ టెక్స్ట్ జనరేషన్, క్రియేటివిటీ, మెరుగైన ఇమేజ్ వీడియో సపోర్టు ఇస్తుంది. భారత మార్కెట్లో నెలకు రూ. 1,950 ధరతో ఉన్న ఈ ప్లాన్ అర్హత కలిగిన జియో యూజర్లకు 18 నెలల పాటు ఫ్రీగా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో వీడియో క్రియేట్ కోసం Veo 3.1, నానో బనానా ఇమేజ్ జనరేటర్ వంటి టూల్స్ ఉన్నాయి. జియో యూజర్లు సింకరైజ్ కోసం గూగుల్ డ్రైవ్, ఫొటోలు, జీమెయిల్ అంతటా 2TB క్లౌడ్ స్టోరేజీ కూడా ఉంది.

Read Also : Best Realme Phones : పండగ చేస్కోండి.. రూ. 30వేల లోపు ధరలో 6 బెస్ట్ రియల్‌మి ఫోన్లు మీకోసం.. ఏది కొంటారో కొనేసుకోండి!

కానీ, గూగుల్, రిలయన్స్ మధ్య కుదిరిన డీల్ ప్రకారం.. భారత మార్కెట్లో ఏఐ వినియోగం భారీగా పెరుగుతుంది. సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రీమియం ఏఐ ఫీచర్లను యాక్సస్ చేయొచ్చు. అయితే, రిలయన్స్ దేశంలోని మర్చంట్లకు సపోర్టు కోసం అడ్వాన్స్ ఏఐ సొలుషన్స్ అందించే గూగుల్ క్లౌడ్ సర్వీసులను పొందవచ్చు.

జెమిని AI 3 ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అర్హతలివే :

ఫ్రీ జెమిని ఏఐ 3 సబ్‌స్క్రిప్షన్ ఎంపిక చేసిన అన్‌లిమిటెడ్ 5G రీఛార్జ్ ప్లాన్‌లు జియో కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక మంది జియో యూజర్లకు యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ బెనిఫిట్ ప్లాన్‌లు పొందాలంటే అర్హత పొందాలి. వినియోగదారులు తమ యాక్టివ్ ప్లాన్ ఈ ఆఫర్‌కు వర్తిస్తుందో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. MyJio యాప్‌లో అర్హత ఉన్నవారికి మాత్రమే బ్యానర్‌ కనిపిస్తుంది.

జెమిని ఏఐ 3 ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ఎలా క్లెయిమ్ చేయాలి? :

  • జియో యూజర్ అయితే.. మీ ఫ్రీ యాక్సెస్‌ను యాక్టివేట్ చేసేందుకు ఈ కింది విధంగా ట్రై చేయండి.
  • మీ స్మార్ట్‌ఫోన్‌లో MyJio యాప్‌ ఓపెన్ లాగిన్ అవ్వండి.
  • జెమిని AI 3 లేదా గూగుల్ ఏఐ ఆఫర్ బ్యానర్ కోసం హోమ్ స్క్రీన్‌ను చెక్ చేయండి.
  • బ్యానర్‌పై ట్యాప్ చేసి మీ జీమెయిల్ ఐడీని ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.
  • స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  • యాక్టివేషన్ పూర్తి చేసేందుకు నిబంధనలను అంగీకరించండి.
  • ప్రాసెస్ పూర్తయిన తర్వాత, మీ జెమిని ఏఐ 3 సబ్‌స్క్రిప్షన్ 18 నెలల పాటు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా యాక్టివ్‌గా ఉంటుంది.