Reliance JioPC : రిలయన్స్ కొత్త JioPC సర్వీసు.. మీ టీవీని డెస్క్‌టాప్ కంప్యూటర్‌గా మార్చేయొచ్చు.. ఫీచర్లు, ధర, ప్లాన్లు ఇవే..!

Reliance JioPC : జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారుల కోసం జియోపీసీ క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీసు తీసుకొచ్చింది.

Reliance JioPC

Reliance JioPC : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త PC కొనకుండానే మీ రెగ్యులర్ టీవీని డెస్క్‌టాప్ కంప్యూటర్‌గా మార్చేసుకోవచ్చు. ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో (Reliance JioPC) కొత్తగా JioPC ప్రవేశపెట్టింది. JioFiber, Jio AirFiber యూజర్ల కోసం ప్రత్యేకంగా క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీసును అందిస్తోంది. మొదటి నెల పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. సరికొత్త జియోపీసీ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జియోపీసీ (JioPC) అంటే ఏంటి? :
జియో సెట్-టాప్ బాక్స్‌లో కీబోర్డ్, మౌస్‌ కోసం జియోపీసీ యాప్‌ను లాంచ్ చేసింది. మీ టీవీ స్క్రీన్‌పైనే డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ సర్వీస్ Linux-ఆధారిత OS Ubuntuలో రన్ అవుతుంది. కానీ, అన్ని ప్రాసెసింగ్ జియో క్లౌడ్ సర్వర్‌లలో రిమోట్‌గా పనిచేస్తుంది.

మీ టీవీ కేవలం డిస్‌ప్లే మాత్రమే మిగతావన్నీ క్లౌడ్‌లో జరుగుతున్నాయి. స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం. జియో ప్రకారం.. జియోపీసీ 4 CPUs, 8GB వర్చువల్ ర్యామ్, 100GB క్లౌడ్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రైమరీ టాస్కుల కోసం లిబ్రేఆఫీస్ బేక్ కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోకల్ ఇన్‌స్టాల్ లేయలేదు.

Read Also : Vivo Y400 : వివో లవర్స్ కోసం మరో క్రేజీ ఫోన్ వస్తోంది.. ఈ ఆగస్టులోనే లాంచ్.. డిజైన్, ఫీచర్లు అదుర్స్.. ఫుల్ డిటెయిల్స్..!

మీరు ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా, ఫస్ట్ నెల రోజులు జియో వర్క్‌స్పేస్ ఫ్రీ ట్రయల్‌ను పొందవచ్చు. మీకు బ్రౌజర్ ఆధారిత మైక్రోసాఫ్ట్ టూల్స్ యాక్సెస్‌ను అందిస్తుంది. మీ స్టోరేజ్‌ను 512GBకి పెంచుకోవచ్చు.

జియో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం నెల ట్రయల్‌ను అందిస్తోంది. వినియోగదారులకు క్రియేటివిటీ వర్క్ కోసం కొన్ని ఈజీ ఏఐ టూల్స్ కూడా యాక్సెస్ అందిస్తుంది. మీ దగ్గర ఇప్పటికే జియో సెట్-టాప్ బాక్స్ లేకపోతే విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

జియోపీసీ ప్లాన్‌లు :
నెల ప్లాన్ : రూ. 599
2 నెలల ప్లాన్ : రూ. 999
6 నెలల ప్లాన్ (8 నెలల యాక్సస్ ): రూ. 2,499
12 నెలల ప్లాన్ (15 నెలల యాక్సస్): రూ. 4,599

దేశవ్యాప్తంగా కొత్త జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సబ్‌స్క్రైబర్‌లందరూ జియోPC పొందవచ్చు. ఈ యాప్ ఇప్పటికే అన్ని జియో సెట్-టాప్ బాక్స్‌లలో ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది.