Vivo Y400 : వివో లవర్స్ కోసం మరో క్రేజీ ఫోన్ వస్తోంది.. ఈ ఆగస్టులోనే లాంచ్.. డిజైన్, ఫీచర్లు అదుర్స్.. ఫుల్ డిటెయిల్స్..!

Vivo Y400 : వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. ఆగస్టు నెలలో వివో Y400 స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo Y400 : వివో లవర్స్ కోసం మరో క్రేజీ ఫోన్ వస్తోంది.. ఈ ఆగస్టులోనే లాంచ్.. డిజైన్, ఫీచర్లు అదుర్స్.. ఫుల్ డిటెయిల్స్..!

Vivo Y400

Updated On : July 31, 2025 / 4:53 PM IST

Vivo Y400 : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వచ్చేస్తోంది. వివో కొత్త Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఆగస్టులో రాబోతుంది. వివో Y400 ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఈ బ్రాండ్ రాబోయే వివో ఫోన్‌కు సంబంధించి ఇండోనేషియాలోని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఒక స్పెషల్ మైక్రోసైట్ కూడా రివీల్ చేసింది. డిజైన్, స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. వివో Y400 ఫీచర్లు, అంచనా ధర, లాంచ్ తేదీ వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

వివో Y400 లాంచ్ తేదీ ఇదే :
వివో Y400 ఆగస్టు 4న ఇండోనేషియాలో లాంచ్ అవుతుంది. ప్రస్తుతానికి, ఇతర దేశాలలో లాంచ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, వివో Y400 5G భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. నివేదికల ప్రకారం.. ఆగస్టు ప్రారంభంలో వివో Y400 5G రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : OnePlus Sale Discounts : వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ సేల్ ఆఫర్లు.. వన్‌ప్లస్ 13, నార్డ్ 5 సిరీస్, టాబ్లెట్స్, ఇయర్‌బడ్స్‌పై బిగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

వివో Y400 ఫోన్ ఫీచర్లు :
అధికారిక లిస్ట్ ప్రకారం.. వివో Y400 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 100 శాతం DCI-P3 కలర్ సాచురేషన్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల ఫుల్-HD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇమేజింగ్ కోసం 50MP సోనీ IMX852 మెయిన్ సెన్సార్, 2MP బోకె కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్‌పై రెండు రోజుల వరకు వస్తుంది. బ్యాటరీ 4 ఏళ్ల బ్యాటరీ లైఫ్ టెక్నాలజీతో వస్తుంది.

వివో Y400 ఫోన్ ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, ఏఐ నోట్స్ సమ్మరీ, ఏఐ క్యాప్షన్స్, ఏఐ డాక్యుమెంట్స్, సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 7.90mm మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది. దుమ్ము, నీటి నిరోధకతకు డబుల్ IP68+IP69 రేటింగ్‌లతో వస్తుంది. అంతేకాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్ పర్పుల్ ట్విలైట్, ట్రాపికల్ గ్రీన్ షేడ్స్‌లో వస్తుంది.