JioHotstar: జియో కొత్త రీఛార్జి ప్లాన్‌ అదిరిపోయిందిగా.. రూ.100కే..

ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్‌ కంటెంట్‌ను చూడడానికి వాడుకోవచ్చు.

రిలయన్స్‌ జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఓ సరికొత్త రీఛార్జి ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంలో సబ్‌స్క్రిప్షన్‌ చేసుకోవాలనుకుంటున్న వారికి ఇదో గుడ్‌న్యూస్‌ అని చెప్పవచ్చు. రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు కేవలం రూ.100 ప్లాన్ తీసుకుంటే ఉచితంగా హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలకు కూడా పొందవచ్చు.

జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ కలిసిన తర్వాత స్ట్రీమింగ్ సర్వీసులు ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌ ద్వారా స్ట్రీమింగ్ సర్వీసుల కోసం నెలవారీ లేదా వార్షిక ప్లాన్‌లో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోకుండానే యాడ్‌-సపోర్టెడ్‌ కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు.

రిలయన్స్ జియో రూ.100 రీచార్జ్‌ ప్లాన్‌ బెనిఫిట్స్‌
రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు రూ.100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా జియోహాట్‌స్టార్‌ కాంప్లిమెంటరీని పొందవచ్చు. మొబైల్ వినియోగదారులు ఈ రూ.100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్‌ కంటెంట్‌ను చూడడానికి వాడుకోవచ్చు.

అయితే, కంటెంట్‌ మధ్యలో యాడ్స్‌ వస్తుంటాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులు అయినప్పటికీ ఈ రీచార్జితో మొత్తం 5జీబీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ డేటా మాత్రమే అందుతుంది. అది డేటా ప్లాన్‌ మాత్రమే. కాల్స్‌, మెసేజ్‌ వంటి సౌకర్యాలు పొందడానికి కాదని గుర్తుంచుకోవాలి. ఈ కాంప్లిమెంటరీ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ మొబైల్‌తో పాటు టీవీలోనూ పనిచేస్తుంది.

సాధారణంగానైతే జియో హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ నెలరోజులకుగానూ రూ.149 నుంచి ఉందన్న విషయం విదితమే. ప్రీమియం ప్లాన్ కావాలనుకునే వారు నెలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 1,499 చెల్లించాలి.