Republic Day 2026 Sale (Image Credit To Original Source)
Republic Day 2026 Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఆకర్షణీయమైన డీల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ ఇప్పుడు ధర రూ.56,999 ఉండగా, ఐఫోన్ 17 రూ.74,900కి అందుబాటులో ఉంది. అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి.
మీరు శాంసంగ్ లవర్స్ అయినా లేదా ఐఫోన్ అప్‌గ్రేడ్ కోసం చూస్తుంటే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో మీకు నచ్చిన శాంసంగ్ లేదా ఐఫోన్ ఏదైనా తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. ఈ సేల్ సందర్భంగా సరసమైన ధరలో లభించే కొన్ని ఫోన్లపై ఓసారి లుక్కేయండి..
ఐఫోన్ 16 :
ఐఫోన్ 16 మోడల్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.56,999కు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌లతో సహా అసలు ధర రూ.79,900 నుంచి భారీగా తగ్గింపు పొందవచ్చు. A18 ప్రాసెసర్ కూడా ఉంది. లేటెస్ట్ iOS 26.3 OSపై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ 16 మోడల్ 48MP ప్రైమరీ షూటర్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
Republic Day 2026 Sale (Image Credit To Original Source)
ఐఫోన్ 17 :
ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 17 మోడల్ తగ్గింపు ధరతో లభిస్తోంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అసలు ధర రూ. 82,900 నుంచి రూ. 74,900కు ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతోంది. ఈ ఐఫోన్ 17 మోడల్ రెండు 48MP సెన్సార్‌లతో సహా డ్యూయల్ కెమెరా సిస్టమ్ అందిస్తుంది. అంతేకాదు.. ఐఫోన్ 17లో 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB ర్యామ్ వేరియంట్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,15,990కి లభిస్తోంది. అమెజాన్‌లో ఇదే ఫోన్ ధర రూ.1,22,990కి లభ్యమవుతోంది.
ఈ అల్ట్రా ఫోన్ ధర తగ్గాలంటే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. 5000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అసలు ధర రూ.1,34,999 ఉండగా ఇప్పుడు రూ.99,999కి లభ్యమవుతోంది. 200MP ప్రైమరీ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందిస్తుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.