Whatsapp Eta Feature Whatsapp Is Rolling Out A New Eta Feature For Beta Users
WhatsApp ETA Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు వస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా 2GB వరకు ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. అంటే.. ఫైల్ షేరింగ్ ఆప్షన్ ద్వారా మీరు ఏదైనా ఫైల్ డౌన్ లోడ్ చేసకోవచ్చు లేదా ఆయా ఫైళ్లను వాట్సాప్ సర్వర్లకు అప్ లోడ్ చేసుకోవచ్చు. అందుకు పట్టే ఎస్టిమేటెడ్ టైమ్ ఈ కొత్త ఫీచర్ డిస్ ప్లే చేస్తుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్, డెస్క్‌టాప్ బీటా వెర్షన్ అప్‌డేట్స్‌లో మాత్రమే ఫీచర్‌ను యాడ్ చేసింది వాట్సాప్.
వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం… యూజర్లు ఏ ఫైల్‌ను అప్‌లోడ్ చేయడం గానీ డౌన్‌లోడ్ చేసినప్పుడు ఫైల్ లోడింగ్ ఎస్టిమేటెడ్ టైమ్ ఎంతసేపు ఉంటుందో ఫీచర్ చూడొచ్చు. ఎంతసేపు డౌన్‌లోడ్ అవుతుందో ఈ ఫీచర్ టైమింగ్ కౌంట్ చూపిస్తుంది. కొత్తగా 2GB ఫైల్ షేరింగ్ ఆప్షన్ ద్వారా లార్జ్ ఫైల్స్ క్షణాల వ్యవధిలో షేర్ చేయొచ్చు.
ఇలా ఫైల్స్ ఎంత సమయంలోగా షేర్ అవుతాయో ముందుగానే తెలుసుకోవచ్చు. అయితే స్లో ఇంటర్నెట్ యూజర్లకు కష్టమే మరి.. దాంతో వాట్సాప్ ఈ కొత్త అప్‌డేట్‌తో ఫైల్‌ను షేర్ చేసే సమయంలోనే ఫైల్ పేరుతో పాటు చాట్ బబుల్‌లో ETA (Estimated Time Of Arrival) లేబుల్‌ను చూపిస్తుంది.
ఈ కొత్త ఫీచర్ ముందుగా వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేసింది. వారం రోజుల క్రితమే ఆండ్రాయిడ్, ఐఓఎస్ సహా పలు బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే వాట్సాప్ రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ మీ యాప్‌లో కనిపించడం లేదా? మీకు ఇంకా అందుబాటులోకి రాలేదని గుర్తించుకోవాలి.
Read Also : Whatsapp Voice Message Malware : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. క్లిక్ చేశారో మీ డబ్బులు మాయం