Whatsapp Voice Message Malware : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. క్లిక్ చేశారో మీ డబ్బులు మాయం

యూజర్లకు ఈ-మెయిల్ పంపుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం..(Whatsapp Voice Message Malware)

Whatsapp Voice Message Malware : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. క్లిక్ చేశారో మీ డబ్బులు మాయం

Whatsapp Voice Message Malware

Updated On : April 7, 2022 / 12:00 AM IST

Whatsapp Malware : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వారి కన్ను ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ పై పడింది. వాట్సాప్ వేదికగా కొత్త తరహా చీటింగ్ కు తెరలేపారు సైబర్ క్రిమినల్స్. వాట్సాప్ లోని వాయిస్ నోట్ మెసేజ్ పేరుతో యూజర్లకు ఈ-మెయిల్ పంపుతున్నారు. ఆ మెసేజ్ ను క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయిపోతాయి.(Whatsapp Voice Message Malware)

Android Malware : ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డేంజరస్ మాల్‌వేర్.. మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు జాగ్రత్త!

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా యాప్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్.. ఇలా రకరకాల యాప్స్ తెగ వాడేస్తున్నారు. దాదాపు అందరికీ వీటిని వినియోగిస్తున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్లు ఆ యాప్స్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఆయా సంస్థలు యూజర్ డేటా భద్రతకు ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ యూజర్లను ఏమార్చి కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా హ్యాకర్స్‌ వాట్సాప్‌ ఫీచర్‌ను ఉపయోగించి మరో కొత్త మోసానికి తెరలేపారు. వాట్సాప్‌ సంస్థకు చెందిన వ్యక్తి పంపుతున్నట్లు వాయిస్‌ నోట్ ఈ-మెయిల్‌కు అటాచ్‌ చేసి పంపుతున్నారు. ఆ వాయిస్‌ నోట్‌పై క్లిక్ చేయమని సూచిస్తున్నారు. ఒకవేళ యూజర్‌ వాయిస్‌ నోట్‌పై క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.(Whatsapp Voice Message Malware)

WhatsApp Ban : 14.26 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం..!

సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌లోని వాయిస్‌ నోట్‌ మెసేజ్‌ పేరుతో యూజర్లకు ఈ-మెయిల్ పంపుతున్నారు. వాట్సాప్ సంస్థ పంపినట్లుగా ఉండే ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే మన డివైజ్‌లో సైబర్‌ నేరగాళ్లకు సంబంధించిన మాల్‌వేర్‌ ఆటో మేటిక్ గా ఇన్‌స్టాల్‌ అవుతుంది. కట్ చేస్తే.. మన బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకుని సైబర్‌ కేటుగాళ్లు డబ్బును లూటీ చేస్తున్నారు.

హెల్త్‌కేర్‌, ఎడ్యూకేషన్‌, రిటైల్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 28 వేల మందికి పైగా ఇలాంటి మెసేజ్ వచ్చిందని చెప్పారు. ఇటువంటి మెయిల్స్‌ను నమ్మవద్దని, చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దాడుల బారిన పడకుండా ఉండటానికి యూజర్లు డివైజ్‌లో సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటున్నారు. అలాగే ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతాలకు టూ ఫ్యాక్టర్‌ సెటప్‌ అథెంటికేషన్‌ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

Instagram Blue Tick : ఇన్‌స్టాలో ‘బ్లూ టిక్’ ఇలా తెచ్చుకోవచ్చు..? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్‌ మెసేజింగ్‌ యాప్.‌.వాట్సాప్.. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్‌ సొంతం. ఎప్పుడూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందబాటులోకి తెస్తూ మరింత పటిష్టంగా యాప్‌ను రూపొందిస్తోంది వాట్సాప్‌. చిన్న, పెద్ద.. అనే తేడా లేదు.. అందరికీ వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి.

Realme C31 Sale : రియల్‌మి C31 ఫోన్‌ ఫస్ట్ సేల్.. రూ. 500 డిస్కౌంట్.. కండీషన్స్ అప్లయ్..!