Google Employees Salaries Leak : గూగుల్ ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? చేస్తే ఇలాంటి జాబ్ చేయాలి భయ్యా.. ఇక లైఫ్ సెటిల్ అయినట్టే..!

Google Employees Salaries Leak : గూగుల్ ఉద్యోగులకు అధిక మొత్తంలో జీతం చెల్లిస్తోంది. సాధారణంగా అత్యధికంగా చెల్లించే టెక్ కంపెనీలలో గూగుల్ ఒకటిగా ఉంది. ఇప్పుడు, గూగుల్ ఉద్యోగుల జీతాలు బిజినెస్ ఇన్‌సైడర్ ద్వారా లీక్ అయ్యాయి.

Salaries of Google employees leak, software engineers get Rs 5.90 crore base salary

Google Employees Salaries Leak : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) ఉద్యోగుల జీతాలకు సంబంధించిన డేటా లీక్ అయింది. ఇంటర్నల్ స్ప్రెడ్‌షీట్ నివేదిక ప్రకారం.. గూగుల్ ఉద్యోగుల్లో వివిధ స్థానాల్లో కంపెనీ పే స్కేల్‌ను రివీల్ చేసింది. ముఖ్యంగా, గూగుల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అత్యధికంగా సంపాదిస్తున్నారు. 2022లో గరిష్ట మూల వేతనం 718,000 డాలర్లుగా ఉంది. ఇంటర్నల్ స్ప్రెడ్‌షీట్ డేటాలో 12వేల మంది అమెరికా ఉద్యోగుల నుంచి డేటా లీక్ అయింది. ఈ జాబితాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపార విశ్లేషకులు, విక్రయదారులు మరిన్ని రోల్స్ ఉన్నాయి. లీక్ అయిన డేటాను పరిశీలిస్తే.. గూగుల్ కంపెనీలో ఇంజనీరింగ్, బిజినెస్, సేల్స్‌లో అత్యధికంగా చెల్లించే 10 స్థానాల్లో బేస్ శాలరీ 6 అంకెలుగా ఉన్నాయి.

Read Also : Oppo Reno 10 5G Price : ఒప్పో రెనో 10 5G ధర ఎంతో తెలిసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. రూ.3 వేలు డిస్కౌంట్..!

ఆసక్తికరంగా, గూగుల్ చెల్లించే పరిహారంలో స్టాక్ ఆప్షన్లు, బోనస్‌లు కూడా ఉన్నాయి. ఇవి కేవలం బేస్ శాలరీకి మించినవిగా చెప్పవచ్చు. 2022లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఈక్విటీలో 1.5 మిలియన్ డాలర్ల వరకు సంపాదించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. 2022కి సంబంధించి అన్ని పరిశ్రమల్లో గూగుల్‌లో అత్యధిక మూల వేతనాల్లో మొదటి 10 స్థానాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (రూ. 5.90 కోట్లు), ఇంజినీరింగ్ మేనేజర్ (రూ. 3.28 కోట్లు), ఎంటర్‌ప్రైజ్ డైరెక్ట్ సేల్స్ (రూ. 3.09 కోట్లు), లీగల్ కార్పొరేట్ కౌన్సెల్ రూ. 2.62 కోట్లు, సేల్స్ స్ట్రాటజీ రూ. 8, 2.8 కోట్లు, ప్రభుత్వ వ్యవహారాలు & పబ్లిక్ పాలసీ (2.56 కోట్లు), రీసెర్చ్ సైంటిస్ట్ (2.53 కోట్లు), క్లౌడ్ సేల్స్ (2.47 కోట్లు), ప్రోగ్రామ్ మేనేజర్ (2.46 కోట్లు)తో ఈ జాబితాలో ఉన్నారు.

Salaries of Google employees leak, software engineers get Rs 5.90 crore base salary

అయితే, ఈ డేటా అమెరికాలోని ఫుల్ టైమ్ ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఆల్ఫాబెట్ ఇతర వెంచర్‌ల నుంచి వేతనాలను కలిగి ఉండదని గమనించడం ముఖ్యం. దీనికి అదనంగా, డేటా పరిమిత సంఖ్యలో వెల్లడించిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులందరూ తమ ఈక్విటీ, బోనస్ సమాచారాన్ని రివీల్ చేయరు. MyLogIQ ద్వారా సేకరించిన, ది వాల్ స్ట్రీట్ జర్నల్ ద్వారా విశ్లేషించిన 2022 డేటాను పరిశీలిస్తే.. 3లక్షల డాలర్ల మధ్యస్థ జీతంతో అత్యధికంగా చెల్లించే కంపెనీల జాబితాలో Meta రెండవ స్థానాన్ని పొందింది. అయితే, గూగుల్ పేరంట్ కంపెనీ (Alphabet) సగటు జీతం రూ. 2 లక్షల 80వేల డాలర్లతో 3వ స్థానంలో నిలిచింది.

Read Also : Hyundai Exter : కొంటే ఇదే కారు కొనాలి భయ్యా.. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త మైక్రో SUV.. మైలేజీ, ఫీచర్లు, వేరియంట్లు, ధర ఎంతంటే?