Samsung Galaxy A06 5G : రూ. 10వేల ధరలో కొత్త శాంసంగ్ ఫోన్.. ఫీచర్లు మాత్రం కేక.. ఇంత తక్కువకే వస్తుంటే కొనాల్సిందే..!

Samsung Galaxy A06 5G : తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ కావాలా? అయితే, భారత మార్కెట్లోకి సరికొత్త శాంసంగ్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. కేవలం రూ. 10వేల ధరలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Samsung Galaxy A06 5G

Samsung Galaxy A06 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి శాంసంగ్ లేటెస్ట్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ A06 5G పేరుతో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ రూ. 10,499 ప్రారంభ ధరకు ప్రవేశపెట్టింది. 90Hz రిఫ్రెష్ రేట్, పాలికార్బోనేట్ బిల్డ్‌తో కూడిన 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది.

కొత్త ఫోన్ ముందున్న గెలాక్సీ A06 (4G వెర్షన్) మాదిరిగా ఉంటుంది. కేవలం 5 నెలల తర్వాత యూజర్లకు అప్‌గ్రేడ్ ఆప్షన్ కంపెనీ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన గెలాక్సీ A06 5జీ శాంసంగ్ వన్‌యూఐ సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది.

Read Also : Investment Ideas : వావ్.. కొత్తగా జాబ్‌లో చేరారా? మీ ఫస్ట్ జీతంతో ఇలా పెట్టుబడి పెట్టండి.. భవిష్యత్తులో డబ్బులకు డోకా ఉండదు భయ్యా..!

శాంసంగ్ గెలాక్సీ A06 5జీ ధర, లభ్యత :
శాంసంగ్ గెలాక్సీ A06 5జీ అనేది ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ధర రూ. 10,499కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ పార్టనర్ల ద్వారా అందుబాటులో ఉంది. గెలాక్సీ A06 5జీ ఫోన్ మొత్తం 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. శాంసంగ్ బేస్ మోడల్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీలు ఉన్నాయి.

మిడ్-వేరియంట్, అదే ర్యామ్ కానీ 128జీబీ స్టోరేజీతో వస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 11,499కు పొందవచ్చు. చివరగా, 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 12,999కు అందిస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రే, లైట్ గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. శాంసంగ్ కేర్ ప్లస్ ద్వారా రూ.129కి గెలాక్సీ A06 5జీ కొనుగోలుపై ఏడాది స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా శాంసంగ్ అందిస్తోంది. దీని ధర సాధారణంగా రూ.699 నుంచి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A06 5జీ కీలక స్పెక్స్, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ A06 5జీ ఫోన్ 4G వెర్షన్‌ని మాదిరిగా ఉంటుంది. 5G వేరియంట్ కొత్త షేడ్స్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

సెల్ఫీల విషయానికి వస్తే..డ్యూ-డ్రాప్ నాచ్‌లో ఉన్న 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కాల్స్ కోసం శాంసంగ్ యాజమాన్య వాయిస్ ఫోకస్ ఫీచర్, 12 5జీ బ్యాండ్‌లకు సపోర్టు వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Oppo Find N5 Launch : వారెవ్వా.. ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ చూశారా? ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

ఫ్రంట్ సైడ్‌లో శాంసంగ్ గెలాక్సీ A06 5జీ ఫోన్ HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన పెద్ద 6.7-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, గెలాక్సీ A06 5జీ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది.

ఇటీవల లాంచ్ అయిన గెలాక్సీ F06 5జీకి పవర్ ఇచ్చే అదే చిప్. 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పెద్ద 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా శాంసంగ్ లేటెస్ట్ వన్‌యూఐ 7.0పై రన్ అవుతుంది. కంపెనీ 4 ఏళ్ల ప్రధాన ఓఎస్ అప్‌డేట్స్‌తో పాటు 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తోంది.