Investment Ideas : వావ్.. కొత్తగా జాబ్‌లో చేరారా? మీ ఫస్ట్ జీతంతో ఇలా పెట్టుబడి పెట్టండి.. భవిష్యత్తులో డబ్బులకు డోకా ఉండదు భయ్యా..!

Investment Ideas : ఉద్యోగం వచ్చిన వెంటనే మీరు మొదటగా చేయాల్సిందిల్లా.. పెట్టుబడి పెట్టడమే.. క్రమం తప్పకుండా ఇలా పెట్టుబడి పెడుతూ పోతే భవిష్యత్తులో మీ ఆర్థిక అవసరాలకు ఎలాంటి డోకా ఉండదు.. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.

Investment Ideas : వావ్.. కొత్తగా జాబ్‌లో చేరారా? మీ ఫస్ట్ జీతంతో ఇలా పెట్టుబడి పెట్టండి.. భవిష్యత్తులో డబ్బులకు డోకా ఉండదు భయ్యా..!

Investment Ideas for Beginners

Updated On : February 21, 2025 / 1:09 PM IST

Investment Ideas : కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీ లైఫ్ ఇప్పటినుంచే సెట్ చేసుకోండి. భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. ఇంతకీ ఏమి చేయాలా అంటారా? ఏమి లేదు.. సింపుల్‌గా ఇన్వెస్ట్ చేయండి చాలు.. అది ఎలా అంటారా? మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత వచ్చే మొదటి జీతంతోనే పెట్టుబడి పెట్టండి.. అలానే పెడుతూ పోతే కొన్నాళ్లకు మీరు భారీ మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది.

ప్రస్తుత రోజుల్లో ఉద్యోగాల్లో జీతాలు కన్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతిఒక్కరూ ముందుగా తమ ఫ్యూచర్ ఫండ్స్ గురించి ఆలోచించుకోవాలి. మీరు ఉద్యోగంలో పనిచేస్తున్నంత కాలం పెట్టుబడి పెడుతూనే ఉండండి.

Read Also : Gold Rates : అరే.. పెరిగాయి.. తగ్గాయి అంటారు.. అసలు రోజువారీగా బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసా?

మీ జీవితంలో ఏదో ఒకరోజు అదే డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. ఉద్యోగం చేసినంత కాలం ఇలానే పెట్టుబడిని కొనసాగించండి. కొన్నాళ్లకు అంటే.. మీరు రిటైర్మెంట్ తీసుకున్నాక లేదా మీ ఇంట్లో పిల్లల చదవు కోసమైనా లేదా ఆడపిల్లలు పెళ్లిడుకు వచ్చినా ఆ సమయంలో ఇదే డబ్బు ఉపయోగపడుతుంది. అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఖర్చు వచ్చినా కూడా ఈ డబ్బు మీకు అండగా నిలుస్తుంది.

తెలివిగా మీరు ఇప్పుడు చేసినా ఈ పొదుపే భవిష్యత్తులో మీతో పాటు మీ కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది అనమాట.. అంతాబాగానే ఉంది కానీ, ఎందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చెప్పలేదుగా అంటారా? అక్కడికే వస్తున్నాం..

ప్రస్తుత రోజుల్లో పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే, ఎక్కడ ఎందులో ఎలా పెట్టుబడి పెట్టాలి అనేది చాలామంది అవగాహన ఉండదు. మీరు కూడా ఎందులో పెట్టుబడి పెడితే మంచిది? ఏయే మార్గాలు ఉన్నాయో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్ :
స్టాక్ మార్కెట్‌ వద్దు రిస్క్ అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్ బాండ్లు, స్టాక్స్ వంటి అనేక పోర్ట్‌ఫోలియోతో ఉంటాయి. పెట్టుబడిదారుల నుంచి నేరుగా ఫండ్స్ సేకరిస్తాయి. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లతో పెట్టుబడి పెడతాయి. అయితే, మీరు నేరుగా ఈక్విటీలో పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో నెలవారీ పెట్టుబడి పెడితే మంచి రాబడులను పొందవచ్చు.

బాండ్లు :
తీసుకున్న రుణంపై పెట్టుబడి పెట్టేవారికి ఇది బెస్ట్. ఒక్కమాటలో చెప్పాలంటే.. బాండ్ అనేది నిర్దిష్ట కాల వ్యవధిలో డబ్బును అందించే పెట్టుబడి మార్గంగా చెప్పవచ్చు. మీకు ఇక్కడ వడ్డీ చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తాన్ని చెల్లిస్తారు.

12 నెలల నుంచి 36 నెలలకు స్థిర ఆదాయం కోసం కార్పొరేట్ బాండ్లలో సులభంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు కార్పొరేట్ బాండ్‌లు చాలా అవసరం కూడా. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ రాబడి ఉంటుంది. చాలా కంపెనీలు ఫండ్స్ సేకరించేందుకు కార్పొరేట్ బాండ్లను జారీ చేస్తుంటాయి.

స్టాక్ మార్కెట్ :
కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ ఆప్షన్. మన దేశీయ స్టాక్ మార్కెట్లో జాబితా అయిన అనేక కంపెనీల షేర్లను ఓసారి పరిశీలించండి. దానికి ముందుగా మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అందులోనే మీరు నచ్చిన షేర్లను కొనేసుకోవచ్చు. షేర్ల ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోవచ్చు.

ఇందులో పెట్టుబడికి ఆయా కంపెనీల ఆర్థిక, స్టాక్ పనితీరు, భవిష్యత్తు అవకాశాలకు సంబంధించి అవగాహన పెంచుకోవడం ఎంతైనా మంచిది. డివిడెండ్ స్టాక్స్‌లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఐపీఓ ద్వారా కూడా పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుంది. పెట్టుబడి పెట్టే సమయంలో ఆయా షేర్ల స్థితిగతులపై కూడా అవగాహన పెంచుకోవాలి.

Read Also : Post Office Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. లైఫ్‌లో ఒక్కసారే పెట్టుబడి.. ప్రతి నెలా రూ. 5వేలకుపైగా సంపాదించొచ్చు..!

డిజిటల్ గోల్డ్ :
డిజిటల్ గోల్డ్ అనేది ఫిజికల్ గోల్డ్‌కు భిన్నంగా ఉంటుంది. అంటే.. భౌతికంగా కాకుండా డిజిటల్‌గా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ డిజిటల్ గోల్డ్‌పై కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో గోల్డ్ కొనుగోలు చేయడమే. ఈ గోల్డ్‌కు కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మీరు 24 క్యారెట్ల హాల్‌మార్క్ గోల్డ్ రూ.1 నుంచి కొని దానిపై పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం పేటీఎం, ఫోన్ పే వంటి అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ :
దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూసేవారికి రియల్ ఎస్టేట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో పెట్టుబడితో ట్రస్ట్‌లు, భవనాల అద్దెలపై పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడి ట్రస్ట్ గురించి చెప్పాలంటే.. ఇది ఆస్తిలో యాజమాన్యం, ఆదాయాన్ని పరోక్షంగా పొందవచ్చు. హోటళ్లు, ఆఫీసుల బిల్డింగ్స్, షాపింగ్ సెంటర్‌ రియల్ ఎస్టేట్ ఆస్తులలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఆసక్తి ఉంటే ఈ పెట్టుబడి మార్గాల్లో చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.