Gold Rates : అరే.. పెరిగాయి.. తగ్గాయి అంటారు.. అసలు రోజువారీగా బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసా?

Gold Rates : బంగారం ధరలు పెరుగుతుంటాయి.. తగ్గుతుంటాయి. ఈ రోజు పెరిగితే రేపు తగ్గుతాయి.. మళ్లీ పెరగొచ్చు.. లేదంటే తగ్గొచ్చు.. ప్రతిరోజూ ఇదే జరిగేది. కానీ, ఈ బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసా? అయితే మీ స్టోరీ మీకోసమే..

Gold Rates : అరే.. పెరిగాయి.. తగ్గాయి అంటారు.. అసలు రోజువారీగా బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసా?

Gold Rates will be decided in India

Updated On : February 21, 2025 / 11:38 AM IST

Gold Rates : ఇప్పుడు ఎక్కడ చూసినా విన్నా ఒకటే మాట.. బంగారం పెరిగింది.. బంగారం తగ్గింది.. మళ్లీ పెరిగింది.. ఇదే ఎక్కువగా వినిపిస్తుంటుంది. అసలు ఈ బంగారానికి మన భారతీయులకు ఆత్మీయ సంబంధం ఉంది. బంగారం అనేది మన దేశీయ సంప్రదాయాల్లో ఒకటిగా మారింది. అంతగా బంగారాన్ని ప్రేమిస్తారు.

అందుకే బంగారం ధరలు తగ్గాయి అనగానే వెంటనే కొనేందుకు ఆరాటపడుతుంటారు. అదే బంగారం పెరిగింది అనగానే వెంటనే నిరాశ చెందుతుంటారు. పెళ్లి కాని వారి దగ్గర నుంచి పెళ్లి అయిన మహిళల వరకు అందరూ ఈ బంగారం గురించి పెద్దగా చర్చించుకుంటుంటారు.. అంతగా బంగారంపై మక్కువ పెంచుకున్నారు. ఇప్పుడు అందరూ బంగారాన్ని ఒక పెట్టుబడిగా చూస్తున్నారు. భవిష్యత్తులో బాసటగా నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.

Read Also : Buying Gold Tips : బంగారం కొనేటప్పుడు జర జాగ్రత్త.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. డబ్బులు, బంగారం ఊరికే రావు కదా..!

అలాంటి బంగారం గతకొద్ది వారాలుగా ఆకాశాన్ని అంటుతోంది. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త రేటు ఉంటుంది. నిన్న ఒకటి ఉంటే ఈరోజు మరొకటి.. ఉదయం ఒక రేటు ఉంటే.. మధ్యాహ్నానికి ఒక రేటు.. ఇలా రోజులో సమయాన్ని బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తూనే ఉంటాయి. బంగారం ధరలు ప్రాంతం, రాష్ట్రాన్ని బట్టి కూడా హెచ్చుతగ్గుదల ఉంటుంటాయి.

బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారంటే? :
ఇలా బంగారం ధరలు పదేపదే తగ్గడానికి పెరగడానికి కారణాలు అనేకమని చెప్పవచ్చు. అసలు ఈ బంగారం ఎప్పుడు తగ్గాలి? ఏ రోజు పెరగాలి అనేది ఎవరూ డిసైడ్ చేస్తారో తెలుసా? ఏ సమయంలో ఎంత ధర ఉండాలో నిర్ణయించే వాళ్లు ఎవరబ్బా అనే ప్రశ్న తలెత్తక మానదు. మీకు కూడా ఈ డౌట్ వచ్చిందా ఎప్పుడైనా? మన దేశంలో బంగారం ధరలను డిసైడ్ చేసేది ఎవరు? ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సాధారణంగా మనం బంగారాన్ని మార్కెట్లో స్వచ్ఛత ఆధారంగా 3 రకాలుగా విభజిస్తారు. అందులో ముందుగా 18 క్యారెట్ల బంగారం, అలాగే 24 క్యారెట్.. ఇది కూడా 3 కేటగిరిలో ఉంటుంది. ఇది సరే.. రోజువారీ బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు అనేది పరిశీలిస్తే.. ‘ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్’ అనే సంస్థ ఈ పసిడి ధరలను నిర్ణయిస్తుంది.

రోజువారీగా బంగారం ధరలు ఎంత ఉండాలి అనేది నిర్ణయిస్తుంది. అది ఎలాగంటే.. మన దేశంలో బడా బంగారు డీలర్లు ఉంటారు కదా.. ప్రతిరోజు బంగారం ధరలు అనేవి అంతర్జాతీయ డిమాండ్, సప్లయ్, దిగుమతి పన్నులు, కరెన్సీలో హెచ్చుతగ్గుదల, రూపాయి మారకం విలువ, లోకల్ ట్యాక్స్ వంటి అనేక అంశాల ఆధారంగా డిసైడ్ చేస్తుంటారు.

ఇటీవల కొద్దిరోజులుగా బంగారం ధరలు అమాంతం పెరిగిపోవడానికి ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ ప్లాన్లు విధించడమే. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి. అందులోనూ బంగారంపై పెట్టుబడులు పెడితే.. కొద్దిగా నష్టాలు ఉంటే ఉండొచ్చు. కానీ, బంగారంతో పూర్తిగా నష్టపోయినా వాళ్లు ఉండరనే చెప్పాలి. ఈ కారణంగానే అనేక మంది అధిక పెట్టుబడులు పెట్టేందుకు చూస్తుంటారు.

బంగారం ధరలను ఎలా నిర్ణయిస్తారంటే? :
భారత బులియన్ మార్కెట్లో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) బంగారం ధరను నిర్ణయిస్తుంటుంది. దేశంలోని అతిపెద్ద బంగారు డీలర్లతో ఐబీజేఏ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థనే మన దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలను ఎంత అనేది నిర్ణయిస్తుంది.

ఈ ఐబీజేఏ సంస్థ మన దేశంలోని అనేక అతిపెద్ద బంగారు డీలర్లతో ప్రతిరోజూ చర్చిస్తుంటుంది. అలాగే, డీలర్ల బంగారం కొనుగోలుతో పాటు వారి అమ్మకం కోట్‌లను కూడా లెక్కిస్తుంది. ఇందులో లోకల్ ట్యాక్సులు, ఇంపోర్టెడ్ ట్యా్క్సులు, కరెన్సీ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకుంటుంది. తద్వారా బంగారానికి తగిన ధరలను నిర్ణయించి సర్దుబాటు చేస్తుంటుంది. ఆపై రోజువారీగా బంగారం ధరలను ప్రకటిస్తుంటుంది.

Read Also : Gold Hallmark : మీ బంగారంపై ‘హాల్‌మార్క్‌’ చూశారా? ఈ గుర్తు ఏంటో తెలుసా? అసలు ‘గోల్డ్’పై ఎందుకు ఉంటుందంటే?

బంగారం ధరలు లెక్కించే ఫార్ములా ఏంటి? :
దేశంలో బంగారం ధరను స్వచ్ఛతను బట్టి రెండు రకాలుగా లెక్కిస్తారు. అందులో ఒకటి స్వచ్ఛత పద్ధతి (%) : బంగారం విలువ = (బంగారం రేటు x స్వచ్ఛత x బరువు) / 24. రెండోది.. క్యారెట్ పద్ధతి అంటే.. బంగారం విలువ = (బంగారం రేటు x స్వచ్ఛత x బరువు) / 100 ఆధారంగా లెక్కిస్తారు. దేశంలో బంగారం ధరలను అధిక శాతం అనధికారిక ప్రక్రియ ద్వారానే నిర్ణయిస్తారట.

అమ్మకం, డీలర్ల కొనుగోలు, దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు వంటివి కూడా బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బంగారం ధరలను 22 క్యారెట్లు/ గ్రాములు, 24 క్యారెట్లు/ గ్రాములు, 18 క్యారెట్లు/ గ్రాములలో లెక్కించి వాటి ధరలను అంచనా వేస్తారు.