Post Office Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. లైఫ్‌లో ఒక్కసారే పెట్టుబడి.. ప్రతి నెలా రూ. 5వేలకుపైగా సంపాదించొచ్చు..!

Post Office Scheme :పోస్టాఫీసులో సూపర్ స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. మీరు ఈ పథకంలో ఒకసారి పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ. 5వేలకు పైగా డబ్బులను సంపాదించుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Post Office Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. లైఫ్‌లో ఒక్కసారే పెట్టుబడి.. ప్రతి నెలా రూ. 5వేలకుపైగా సంపాదించొచ్చు..!

Post Office Scheme

Updated On : February 21, 2025 / 12:59 PM IST

Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి ఎలా పెట్టాలా? అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం పోస్టాఫీసులో అనేక సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీకోసం ఓ అద్భుతమైన స్కీమ్ ఒకటి ఉంది.

మీరు గానీ ఈ స్కీమ్‌లో ఒకసారి పెట్టుబడి పెడితే మాత్రం ప్రతి నెలా రూ. 5వేలకు పైగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంతకీ పోస్టాఫీసు అందించే ఆ సూపర్ స్కీమ్ ఏంటో తెలుసా? అదే.. నెలవారీ ఆదాయ పథకం (Monthly Income Scheme).

Read Also : Gold Hallmark : మీ బంగారంపై ‘హాల్‌మార్క్‌’ చూశారా? ఈ గుర్తు ఏంటో తెలుసా? అసలు ‘గోల్డ్’పై ఎందుకు ఉంటుందంటే?

 ఇలా చేస్తే ప్రతినెలా ఆదాయం :
ప్రస్తుతం ఈ ఎంఐఎస్ స్కీమ్‌లో అనేక మంది పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా మీ సేవింగ్స్ కోసం ప్రయత్నిస్తుంటే.. వెంటనే ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో ఒకసారి పెట్టుబడి పెట్టి చూడండి. జీవితంలో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. ఆ తర్వాత క్రమం తప్పకుండా ప్రతినెలా ఆదాయాన్ని పొందవచ్చు. పోస్టాఫీసులో పెట్టుబడి కోసం చూసేవారికి ఇదో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

మీరు కూడా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ప్రస్తుతం, ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారికి 7.4 శాతంగా వడ్డీ రేటు అందిస్తోంది. చాలా మంది పెట్టుబడి పెట్టేవారు పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో పెడుతున్నారు. తద్వారా ప్రతినెలా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

5వేళ్ల వరకు కూడా పెట్టుబడి :
ఈ పథకంలో ప్రధానమైనది ఏంటంటే.. మీరు ఒక్కసారే పెట్టుబడి పెట్టేది.. లేదంటే.. 5 ఏళ్ల వరకు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీ అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాది తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా మీ డబ్బును అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఈ స్కీమ్‌లో రూ. వెయ్యి నుంచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.

Read Also : Gold Rates : అరే.. పెరిగాయి.. తగ్గాయి అంటారు.. అసలు రోజువారీగా బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసా?

మీరు చేయాల్సిందిల్లా.. ఒకే అకౌంట్ ఓపెన్ చేయాలి. మీ అకౌంట్ ద్వారా గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. లేదంటే జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి అందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇలా అయితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ కింద మీరు ఒకేసారి రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టినట్టయితే..

ప్రస్తుత 7.4 శాతం వడ్డీ రేటు ప్రకారం.. మీ నెలవారీ సంపాదన రూ. 5,550 అవుతుంది. నెలవారీ వద్దంటే.. త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన కూడా వడ్డీ డబ్బులతో సంపాదించుకోవచ్చు.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ పథకంలో ఇప్పుడే పెట్టుబడి పెట్టండి.. భవిష్యత్తులోనే కాదు.. ప్రతినెలా ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా హాయిగా గడిపేయొచ్చు.