Samsung Galaxy A15 5G and Galaxy A25 5G set to launch in India
Samsung Galaxy A Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎ15 5జీ ఫోన్ గెలాక్సీ ఎ25 5జీ స్మార్ట్‌ఫోన్‌లను డిసెంబర్ 26న భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు కంపెనీ లాంచ్ ఈవెంట్‌ను ధృవీకరించింది. మిడ్-రేంజ్ ఫోన్‌ల కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా వెల్లడించింది. అయితే, ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌లు ఇటీవలే వియత్నాంలో అందుబాటులోకి రావడంతో డివైజ్ స్పెసిఫికేషన్‌లు ఎలా ఉంటాయో తెలుసు. భారత మార్కెట్లో రాబోయే శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్ ఫోన్‌ల పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : Samsung Galaxy A14 5G : శాంసంగ్ గెలాక్సీ A14 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. కేవలం రూ.14,499కే సొంతం చేసుకోండి!
శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎ15 5జీ ఫీచర్లు :
రాబోయే గెలాక్సీ ఎ25 5జీ స్మార్ట్‌ఫోన్ మెరుగైన కంటెంట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం విజన్ బూస్టర్ టెక్నాలజీతో 120హెచ్‌జెడ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుందని శాంసంగ్ ధృవీకరించింది. 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. షేక్-ఫ్రీ ఫొటోలు, వీడియోలకు ఓఐఎస్ సపోర్టు అందిస్తుంది. గెలాక్సీ ఎ25 5జీ ఫోన్ అనేక ఏఐ రెడీ ఫొటో-ఎడిటింగ్ ఫీచర్లను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన వివరాలను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. చిప్‌సెట్ పేరు ఇంకా రివీల్ చేయలేదు. అయితే, వియత్నాం శాంసంగ్ మోడల్ ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ అందిస్తుంది.
Samsung Galaxy A25 5G
గెలాక్సీ ఎస్23 సిరీస్ మాదిరి డిజైన్ :
అదే, భారతీయ మోడల్‌లో కూడా ఉపయోగించవచ్చు. హుడ్ కింద 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ మోడల్ సిగ్నేచర్ డిజైన్ లాంగ్వేజీతో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఏడాదిలో గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో చూసిన అదే డిజైన్‌ను బ్యాక్ సైడ్ అందించనుంది. విజన్ బూస్టర్ టెక్నాలజీ సపోర్ట్‌తో పాటు సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ15 5జీ, గెలాక్సీ ఎ25 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అదే బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. విడిఐఎస్ సపోర్టుతో పాటు వీడియోలలో బ్లర్ ఆప్షన్ ఉంటుందని కంపెనీ తెలిపింది.
Samsung Galaxy A15 5G
మరెన్నో సెక్యూరిటీ ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్ ఫోన్‌లు రెండూ నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్‌తో వస్తాయి. ఆటో బ్లాకర్, సెక్యూర్ ఫోల్డర్, ప్రైవసీ డ్యాష్‌బోర్డ్, శామ్‌సంగ్ పాస్‌కీ, ఇతర ఫీచర్లతో యూజర్లు తమ డేటాపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు. గెలాక్సీ ఎ15 5జీ ఫోన్ గెలాక్సీ ఎ25 5జీ కూడా నాక్స్ వాల్ట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. యూజర్ డివైజ్‌లో అత్యంత ముఖ్యమైన డేటా కోసం ట్యాంపర్-రెసిస్టెంట్ అందిస్తుందని శాంసంగ్ పేర్కొంది. నాక్స్ వాల్ట్ ఫిజికల్ పిన్‌లు, పాస్‌వర్డ్‌లు, బయోమెట్రిక్స్, సెక్యూరిటీ-క్రిటికల్ కీలను మిగిలిన వాటికి దూరంగా ఉంచుతుంది. సురక్షిత మెమరీలో స్టోర్ చేస్తుందని శాంసంగ్ తెలిపింది.
Read Also : Lava Storm 5G Launch : రూ. 15వేల లోపు ధరకే లావా స్టార్మ్ 5G ఫోన్.. ఈ నెల 28నే సేల్.. డోంట్ మిస్!