Samsung Galaxy A18 4G Leak : వారెవ్వా.. శాంసంగ్ నుంచి చవకైన ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్!
Samsung Galaxy A18 4G Leak : శాంసంగ్ నుంచి గెలాక్సీ A సిరీస్ ఫోన్ వస్తోంది. 5000mAh బ్యాటరీతో చవకైన ఫోన్ రానుంది. ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో లిస్టులో కనిపించగా పూర్తి ఫీచర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
- Sreehari A
- Published on- September 4, 2026 / 04:00 PM IST
Samsung Galaxy A18 4G Leak
- శాంసంగ్ గెలాక్సీ A18 4G ఫోన్ వస్తోంది
- గీక్ బెంచ్ లిస్టులో ఈ ఫోన్ ఫీచర్లు లీక్
- 5000mAh బ్యాటరీ, 4GB ర్యామ్ ఆప్షన్
Samsung Galaxy A18 4G Leak : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి అతి త్వరలో గెలాక్సీ A సిరీస్‌లో బడ్జెట్ ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ ఇటీవల గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఇప్పటికే కొన్ని ఫీచర్లు రివీల్ చేయగా పవర్ ఫుల్ 5000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా.
గీక్‌బెంచ్‌లో లిస్టింగ్ :
శాంసంగ్ గెలాక్సీ A18 4జీ గీక్‌బెంచ్‌లో లిస్టు అయింది. కంపెనీ ఈ ఫోన్ 5జీ మోడల్‌ను కూడా లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వివరాలను బ్లూస్కై అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. గీక్‌బెంచ్ లిస్టులో ఈ ఫోన్ స్టోరేజ్ వేరియంట్‌లతో పాటు కలర్ వేరియంట్లు కూడా వెల్లడయ్యాయి.
ఈ ఫోన్ 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ కావచ్చు. అయితే, ర్యామ్ వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ సిల్వర్ కలర్ ఆప్షన్లలో రావచ్చు. గీక్‌బెంచ్‌లో SM-A185G అనే మోడల్ నంబర్‌తో లిస్టు అయింది.
ఆండ్రాయిడ్ 17తో వస్తుందా? :
గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్‌తో లిస్టు అయింది. ఈ ఫోన్‌లో 4GB ర్యామ్ ఉంటుందని అంచనా. గీక్‌బెంచ్‌లో సింగిల్-కోర్‌లో 745 మల్టీ-కోర్‌లో 2,073 స్కోర్ సాధించింది. గత ఏడాది లాంచ్ చేసిన గెలాక్సీ A17 4జీలో కూడా కంపెనీ ఇదే చిప్‌సెట్‌ను వాడింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్‌యూఐ 9పై రన్ అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ A18 4జీ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. కెమెరా వివరాలను వెల్లడించలేదు. డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుందని అంచనా.
శాంసంగ్ ఇటీవలే గ్లోబల్ మార్కెట్‌లో గెలాక్సీ S26 ఎఫ్ఈ ఫ్యాన్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన గెలాక్సీ S26 సిరీస్‌లో ఇదే చీపెస్ట్ ఫోన్. ఈ ఫోన్‌లో 4900mAh బ్యాటరీ, 50MP కెమెరా, 8GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి. అయితే, భారత మార్కెట్లో ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
