Samsung Galaxy A22 5G ఫోన్ వచ్చేస్తోంది.. జూలై 23నే లాంచ్.. ఫీచర్లు అదుర్స్!

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ A సిరీస్‌లో కొత్త 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది. అదే.. Samsung Galaxy A22 5G ఫోన్. ఈ నెల (జూలై 23, శుక్రవారం)నాడు లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Samsung Galaxy A22 5G India : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ A సిరీస్‌లో కొత్త 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది. అదే.. Samsung Galaxy A22 5G ఫోన్. ఈ నెల (జూలై 23, శుక్రవారం)నాడు లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. గత నెలలోనే యూరప్‌లో Galaxy A22 4G మోడల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరాలు, వాటర్ డ్రాప్ స్టయిల్ డిస్ ప్లే నాచ్ తో వచ్చింది. శాంసంగ్ లాంచ్ చేయబోయే గెలాక్సీ A22 5G ఫోన్ మాత్రం 128GB ఆన్ బోర్డ్ స్టోరేజీతో వస్తోంది. భారత మార్కెట్లోకి గత నెలలోనే శాంసంగ్ 4G LTE వేరియంట్ (6GB + 128GB స్టోరేజీ) తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ A22 5జీ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.

భారత్‌లో A22 5G ధర ఎంతంటే? :
శాంసంగ్ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర వివరాలను వెల్లడించలేదు. భారత మార్కెట్లో ఈ మోడల్ (6GB + 128GB స్టోరేజీ) వేరియంట్ ధర ప్రారంభ ధర రూ.19,999గా ఉండే అవకాశం ఉంది. అలాగే 8GB + 128GB స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 21,999గా ఉండనుంది. ఈ ఫోన్ Grey, Mint, Violet, White కలర్ ఆప్షన్ లలో రానుంది.

స్పెషిఫికేషన్లు ఇవే :
– డ్యుయల్ సిమ్ (Nano)
– 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
– ఆక్టా-కోర్ SoC
– 8GB ర్యామ్
– ట్రిపుల్ రియర్ కెమరా సెటప్
– 48MP ప్రైమరీ సెన్సార్ (f/1.8 lens)
– 5MP అల్ట్రావైడ్ షూటర్, 2MP డెప్త్ సెన్సార్
– సెల్ఫీల కోసం వీడియో చాట్స్
– 8MP సెల్ఫీ కెమెరా (ఫ్రంట్)
– 128GB ఆన్ బోర్డ్ స్టోరేజీ, మైక్రో SD కార్డ్ (1TB)
– 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, and a USB Type-C పోర్ట్
– సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
– 5,000mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్
– 167.2×76.4x9mm సైజు, 203 గ్రాముల బరువు

ట్రెండింగ్ వార్తలు