Samsung Galaxy A36 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ రూ. 29,999కి అందుబాటులో ఉంది. అసలు ధర (Samsung Galaxy A36 5G) నుంచి రూ. 3వేలు తగ్గింది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో అదనపు తగ్గింపు పొందవచ్చు. డిజైన్, డిస్‌ప్లే పర్ఫార్మెన్స్ మిడ్ రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ శాంసంగ్ 5G డీల్ మీకోసమే.. ప్రస్తుతం, అమెజాన్‌లో రూ. 12వేలకు పైగా తగ్గింపుతో ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ A36 డీల్ :
శాంసంగ్ గెలాక్సీ A36 5G ఫోన్ రూ. 32,999కు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 3వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌తో కేవలం రూ. 29,999కు లిస్ట్ అయింది. మీరు SBI క్రెడిట్ కార్డ్ ఈఎంఐ యూజర్ అయితే రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 8,250 వరకు పొందవచ్చు. మొత్తం డిస్కౌంట్ రూ. 12,250 వరకు అందిస్తుంది. శాంసంగ్ A36 ధర రూ. 20,749కి సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A36 స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఆకట్టుకునే 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A36 ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 6 OS అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్ కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది.