Samsung Galaxy A Series : పండగ చేస్కోండి.. ఈ 2 కొత్త శాంసంగ్ 5G ఫోన్లు కిర్రాక్ భయ్యా.. AI ఫీచర్ల కోసమైనా కొనేసుకోవచ్చు!
Samsung Galaxy A Series : ట్రిపుల్ రియర్ కెమెరాలు, 5,000mAh బ్యాటరీలతో శాంసంగ్ గెలాక్సీ A57 5జీ, గెలాక్సీ A37 5జీ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Samsung Galaxy A Series
- శాంసంగ్ గెలాక్సీ A57 5జీ, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఏఐ ఫీచర్లు
- భారీ అమోల్డ్ డిస్ప్లేలు, 120Hz రిఫ్రెష్ రేట్, 5,000mAh బ్యాటరీలు
- 50MP మెయిన్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ UI 8.5
Samsung Galaxy A Series : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి రెండు సరికొత్త శాంసంగ్ 5జీ ఫోన్లు వచ్చేశాయి. వరుస లీక్‌ల తర్వాత శాంసంగ్ చివరకు ఏఐ సిరీస్‌ను 2 కొత్త మిడ్-రేంజ్ డివైజ్లతో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ A57 5జీ, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఫోన్లలో అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరాతో పాటు గెలాక్సీ ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ శాంసంగ్ ఫోన్లు ట్రిపుల్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ UI 8.5, భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. లాంగ్ టైమ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అందిస్తాయి. గత మోడళ్లతో పోలిస్తే ఈ శాంసంగ్ ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. లభ్యత, స్పెసిఫికేషన్లు, ధర, ఇతర వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఎక్సినోస్ 1680 చిప్సెట్తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ అందిస్తుంది. ప్రస్తుతం 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
30 నిమిషాల్లో 60 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ 50MP మెయిన్ కెమెరాతో పాటు 12MP అల్ట్రావైడ్, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ షూటర్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A37 5జీ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A37 ఫోన్ 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ ప్యాక్ సపోర్టు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP మెయిన్ 50MP మాక్రో, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ, గెలాక్సీ A37 5జీ ధర :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ప్రస్తుతం అమెజాన్‌లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ల డెలివరీలు ఏప్రిల్ 2న ప్రారంభం కానున్నాయి. లిస్టింగ్ ప్రకారం.. గెలాక్సీ A57 5జీ బేస్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 56,999గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 62,499గా ఉంది. ఆసమ్ నేవీ, ఆసమ్ ఐసీబ్లూ, ఆసమ్ లైలాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 41,999గా ఉంది. 8GB + 256GB, 12GB + 256GB ర్యామ్, స్టోరేజ్ వెర్షన్ ధరలు వరుసగా రూ. 47,499, రూ. 52,999గా ఉన్నాయి. ఆసమ్ లావెండర్, ఆసమ్ చార్కోల్, ఆసమ్ గ్రేగ్రీన్ షేడ్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
