Samsung Galaxy A77 Series
Samsung Galaxy A77 Series : కొత్త శాంసంగ్ ఫోన్ రాబోతుంది. ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ A77 ఫోన్ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ A77 5G ఫోన్ గీక్ బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ డేటాబేస్‌లో గుర్తించారు. ఏప్రిల్ 2022లో కంపెనీ శాంసంగ్ గెలాక్సీ A73 5జీ ఫోన్ లాంచ్ చేసింది.
ఆ తర్వాత శాంసంగ్ గెలాక్సీ A74 తర్వాతి (Samsung Galaxy A77 Series) మోడళ్లను లాంచ్ చేయలేదు. అంతలోనే గీక్ బెంజ్ డేటాబేస్‌లో ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ A77 కూడా ఉంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత కంపెనీ ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ A73 5G అప్‌గ్రేడ్ వెర్షన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది అనమాట..
గీక్‌బెంచ్‌లో SM-A77B మోడల్ నంబర్‌తో రానుందని నివేదిక తెలిపింది. ఈ శాంసంగ్ గెలాక్సీ A77 ఎక్సినోస్ 2400, ఎక్సినోస్ 2400e జీపీయూలతో రానుంది. ఈ ఫోన్‌లో 8GB ర్యామ్, ఆండ్రాయిడ్ 16, శాంసంగ్ ఎక్స్‌క్లిప్స్ 940 జీపీయూ శాంసంగ్ ఎక్సినోస్ (Deca-core) సీపీయూ ఉంటాయని అంచనా. మల్టీ-కోర్ టెస్టింగ్‌లో ఈ శాంసంగ్ ఫోన్ 5597 పాయింట్లను గీక్‌బెంచ్‌లో సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 1673 పాయింట్లను పొందింది.
శాంసంగ్ A73 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ-O డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ మానిటర్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ 8GB ర్యామ్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ ప్రాసెసింగ్ యూనిట్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లోని ప్రైమరీ కెమెరా 108MP కలిగి ఉంది.
5MP డెప్త్ సెన్సార్, 5MP మాక్రో సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 25-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఫోన్ 5000mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.