Samsung Galaxy F04 launch in India on Jan 04, 2023 _ Here’s what we know so far
Samsung Galaxy F04 launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ F సిరీస్ ఫోన్‌లను త్వరలో భారత మార్కెట్లో విస్తరించనుంది. శాంసంగ్ నుంచి Galaxy F04 ఫోన్ జనవరి 04, 2023న ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. Flipkart లిస్టు ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ టీజర్ కూడా హ్యాండ్‌సెట్ స్టైలిష్ గ్లోస్ డిజైన్‌ను కలిగి ఉంటుందని వెల్లడించింది. రాబోయే ఫోన్ కొన్ని ఫీచర్లను కూడా అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ F04 మోడల్ ఎలాంటి ఫీచర్లతో రానుందో ఓసారి పరిశీలిద్దాం..
శాంసంగ్ గెలాక్సీ F04 ఫీచర్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ F04 MediaTek P35 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 8GB RAMని కలిగి ఉంటుంది. ర్యామ్ ప్లస్ (RAM Plus) ఫీచర్‌ను కూడా అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ హ్యాండ్‌సెట్ జేడ్ పర్పుల్, ఒపాల్ గ్రీన్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందించనున్నట్టు వెల్లడించింది. Galaxy F04 వెనుక భాగంలో స్టైలిష్ గ్లోసీ డిజైన్ ఉంటుంది.
రాబోయే శాంసంగ్ ఫోన్ Android 12 ఆధారంగా కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. కంపెనీ రెండేళ్ల OS అప్‌డేట్‌లను అందిస్తుంది. శాంసంగ్ Galaxy F04 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 6.51-అంగుళాల HD+ డిస్‌ప్లేతో రానుంది. 10 వాట్ అడాప్టర్‌తో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో వచ్చే అవకాశం ఉంది.
Samsung Galaxy F04 launch in India on Jan 04, 2023
శాంసంగ్ Galaxy F04, శాంసంగ్ Galaxy A04e రీబ్రాండెడ్ వెర్షన్ రావొచ్చునని ఆన్‌లైన్ నివేదికలు సూచిస్తున్నాయి. Samsung Galaxy F04 వెనుక 13MP ప్రైమరీ కెమెరాతో వస్తుందని చెప్పవచ్చు. f/2.2 ఎపర్చరుతో రావచ్చు. ప్రధాన సెన్సార్ f/2.4 ఎపర్చరు, LED ఫ్లాష్‌తో కూడిన 2MP డెప్త్ కెమెరాతో రానుంది.
సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో f/2.2 ఎపర్చరుతో 5MP కెమెరాను అందించవచ్చు. Galaxy A04e మూడు మోడళ్లలో 3GB+32GB, 3GB+64GB, 4GB+128GB అందించనుంది. రాబోయే Samsung Galaxy F04 కూడా ఒకటి కన్నా ఎక్కువ స్టోరేజ్ మోడల్‌లలో వస్తుందని భావిస్తున్నారు. ఎంట్రీ-లెవల్ ఫోన్‌గా ధర రూ. 8,000 కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..