Samsung Galaxy F04 : 2023 జనవరిలో శాంసంగ్ గెలాక్సీ F04 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంతలో ఉండొచ్చుంటే?
Samsung Galaxy F04 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి F సిరీస్‌లో కొత్త ఫోన్ రాబోతోంది. 2023లో భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy F04)ని లాంచ్ చేయనుంది. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ వచ్చే వారంలోగా లాంచ్ కావొచ్చునని సూచించింది.

Samsung Galaxy F04 Said to Launch in India in January 2023, Could Cost Under Rs. 8,000_ Report
Samsung Galaxy F04 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి F సిరీస్‌లో కొత్త ఫోన్ రాబోతోంది. 2023లో భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy F04)ని లాంచ్ చేయనుంది. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ వచ్చే వారంలోగా లాంచ్ కావొచ్చునని సూచించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. LED ఫ్లాష్‌తో వెనుకవైపు రెండు ఇమేజ్ సెన్సార్లను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Galaxy F04 గురించి ఎలాంటి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ రీబ్యాడ్జ్ చేసిన Galaxy A04e కావచ్చని పుకార్లు సూచిస్తున్నాయి.
91Mobiles నివేదిక ప్రకారం.. Galaxy F04 జనవరి 2023 మొదటి వారంలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. నివేదికలో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్ ఫొటోలు ఉన్నాయి. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 8వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. బేస్ మోడల్ ధర రూ. 7,499గా ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ (Galaxy F04) ఫిజికల్, వర్చువల్ మెమరీని ఉపయోగించి 8GB వరకు RAMని కూడా అందిస్తుందని చెప్పవచ్చు. పర్పల్, గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అదనంగా, Galaxy F04 రీబ్యాడ్జ్ చేసిన Galaxy A04e కావచ్చు.
భారత్‌లో ప్రారంభ ధర రూ. 9,299గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు కెమెరా వాటర్‌డ్రాప్-స్టైల్‌తో 6.5-అంగుళాల HD+ డిస్ప్లేను పొందుతుంది. హుడ్ కింద, Galaxy A04e ఆక్టా-కోర్ SoCని ప్యాక్ చేస్తుంది. గరిష్టంగా 4GB వరకు ఫిజికల్ ర్యామ్‌తో వచ్చాయి. హ్యాండ్‌సెట్‌లో 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఉంది. మైక్రో SD కార్డ్ (1TB వరకు) ద్వారా విస్తరించవచ్చు. స్మార్ట్‌ఫోన్ 13-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5-MP ఫ్రంట్ ఫేసింగ్ స్నాపర్‌ని పొందవచ్చు. ఈ శాంసంగ్ హ్యాండ్సెట్ 5,000mAh బ్యాటరీతో రానుంది. USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది. Galaxy A04e డ్యూయల్-సిమ్ (Nano) 4G స్మార్ట్‌ఫోన్. 2.4GHz Wi-Fi, బ్లూటూత్ v5.0కి కూడా సపోర్టు అందిస్తుంది.

Samsung Galaxy F04 Said to Launch in India in January 2023, Could Cost Under Rs. 8,000
Samsung Galaxy F04 స్పెసిఫికేషన్లు (అంచనా) :
Samsung Galaxy F04 భారతదేశంలో ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన Galaxy A04e యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. Galaxy F04 స్పెక్స్ షీట్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్ప్లేతో రావచ్చు. డిస్ప్లే వాటర్-డ్రాప్ నాచ్ స్టైల్‌గా ఉండవచ్చు. బెజెల్లతో 60Hz రిఫ్రెష్ రేట్‌ని కలిగి ఉండవచ్చు. 13MP ప్రధాన లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు తీసుకోవడానికి వీడియో కాల్స్ చేసేందుకు 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండవచ్చు.
హుడ్ కింద, MediaTek Helio P35 చిప్సెట్ 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది, 10W ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్టుతో 5,000mAh సెల్ ఉండవచ్చు. శాంసంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ S సిరీస్‌ను త్వరలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. 2023లో Galaxy S23 సిరీస్‌లో S23, S23+తో పాటు S23 అల్ట్రా అనే మూడు మోడల్‌లు ఉంటాయని భావిస్తున్నారు. ఈ మూడు మోడల్స్ Qualcomm Snapdragon 8 Gen 2 SoC ద్వారా పవర్ అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. One Ui 5.1తో ఆండ్రాయిడ్ 13లో బూట్ అవుతుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..