Samsung Galaxy F70 5G : రూ. 17,999కే కొత్త శాంసంగ్ 5G ఫోన్.. 5,000mAh బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు!

Samsung Galaxy F70 5G : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 5జీ ఫోన్ లాంచ్ అయింది. 50MP OIS కెమెరా, సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, ధర, లాంచ్ ఆఫర్ల పూర్తి వివరాలివే..

Samsung Galaxy F70 5G

50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్‌ప్లే
బడ్జెట్‌లో శాంసంగ్ కొత్త 5G ఫోన్ కొనేసుకోవచ్చు
5,000mAh బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు
రూ.20 వేలలోపు ధరకే గెలాక్సీ ఎఫ్70 5జీ ఫోన్

Samsung Galaxy F70 5G : రూ.20వేల లోపు ధరలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, శాంసంగ్ గెలాక్సీ F70 5G మీకోసమే.. ఆకర్షణీయమైన డిజైన్, సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, OIS సపోర్ట్‌తో 50MP కెమెరా, భారీ బ్యాటరీతో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, లాంచ్ ఆఫర్‌తో ఈ శాంసంగ్ ఫోన్ రూ.17,999 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 5జీ ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ F70 5G బేస్ వేరియంట్ 4GB RAM, 128GB స్టోరేజ్‌తో రూ.19,999 ధరకు అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ , 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. లాంచ్ బ్యాంక్ ఆఫర్‌తో బేస్ మోడల్ ధర రూ.17,999కు తగ్గుతుంది. ఈ ఫోన్ అక్టోబర్ 20న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది. Bold Black, Vivid Violet రంగుల్లో లభిస్తుంది.

Read Also : iQOO Neo 12 Launch : సూపర్ ఫోన్ బ్రో.. 9,000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ గేమింగ్ చిప్‌తో కొత్త ఐక్యూ నియో 12..

శాంసంగ్ గెలాక్సీ F70 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్క్రీన్‌కు కార్నింగ్ గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP54 రేటింగ్ కూడా అందించారు.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. :
5nm టెక్నాలజీతో రూపొందించిన శాంసంగ్ ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌ను వాడారు. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. ఫొటోగ్రఫీ కోసం OISతో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా అందించారు.

ఇక 5,000mAh బ్యాటరీతో పాటు 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ, గూగుల్ సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 4 మెయిన్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని శాంసంగ్ ప్రకటించింది. బడ్జెట్‌లో మంచి డిస్‌ప్లే, కెమెరా, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కోరుకునే వారికి ఈ ఫోన్ అద్భుతమైన ఆప్షన్‌గా నిలవనుంది..