Samsung Galaxy F70 5G : రూ.30వేల శాంసంగ్ 5G ఫోన్ ఇప్పుడు రూ.18 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే..

Samsung Galaxy F70 5G : శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 5జీపై ఫ్లిప్‌కార్ట్‌లో 37శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంకు కార్డుతో రూ.18,049కే కొనుగోలు చేయొచ్చు.. 50MP OIS కెమెరా, అమోల్డ్ డిస్‌ప్లే, ఫీచర్లు, ఆఫర్ల వివరాలివే..

Samsung Galaxy F70 5G

  • శాంసంగ్ గెలాక్సీ F70 5జీపై అదిరిపోయే ఆఫర్..
  • తక్కువ ధరలో శాంసంగ్ 5జీ ఫోన్ కావాలా?
  • శాంసంగ్ 5జీ ఫోన్‌పై 37శాతం డిస్కౌంట్..
  • ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy F70 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా మంచి డిస్‌ప్లే, కెమెరా, 5జీ కనెక్టివిటీతో పాటు శాంసంగ్ బ్రాండ్ కావాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F70 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 37 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్‌ కేవలం రూ.18,049కే సొంతం చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ఫీచర్లు, ధర, ఆఫర్లు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ F70 5జీ ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.29,999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18,999కే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే మరో రూ.950 తగ్గింపు లభిస్తుంది.

దీంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.18,049కు తగ్గుతుంది. అయితే డెలివరీ తర్వాత క్యాష్‌బ్యాక్ డిపాజిట్ నిబంధనలు, అర్హతలను చెక్ చేసుకోవాలి. అదనంగా రూ.129 ప్రొటెక్ట్ ప్రామీస్ ఫీ కూడా అప్లయ్ అవ్వొచ్చు..

6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకునే వారికి గరిష్టంగా రూ.14,950 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Cyclone Threat : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే ఛాన్స్.. ఏపీ తీరానికి ముప్పు ఉందా?

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :

ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం మరింత స్మూత్‌గా ఉంటుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. కేవలం 7.5mm మందంతో స్లిమ్ డిజైన్‌లో వస్తుంది. IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది.

పర్ఫార్మెన్స్ పరంగా పరిశీలిస్తే.. ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మాలి-జీ68 జీపీయూ, వన్ యూఐ సాఫ్ట్‌వేర్‌తో పాటు సర్కిల్ టు సెర్చ్, జెమిని, శాంసంగ్ వ్యాలెట్, కోనెక్స్ సెక్యూరిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్.. ఇందులో OIS సపోర్ట్ ఉండటంతో ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు చేతులు కొద్దిగా కదిలినా బ్లర్ లేకుండా ఫొటోలు వస్తాయి..

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000mAh కెపాసిటీ అందించారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

కొనడం మంచిదేనా? :
మొత్తంగా చూస్తే.. మంచి అమోల్డ్ డిస్‌ప్లే, OIS కెమెరా, స్లిమ్ డిజైన్‌తో శాంసంగ్ ఫోన్ కావాలనుకునే వారికి గెలాక్సీ F70 5జీ అద్భుతమైన ఆప్షన్ కావచ్చు. అయితే, 25W ఛార్జింగ్ స్పీడ్ కొంత తక్కువే. కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్, అదనపు ఛార్జీలను చెక్ చేశాకే కొనడం బెటర్..