×
Ad

Samsung Galaxy F70e 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ అదుర్స్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్, ధర ఎంత ఉండొచ్చంటే?

Samsung Galaxy F70e 5G : శాంసంగ్ సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. భారత మార్కెట్లో అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ 5జీ ఫోన్ రూ. 15వేల లోపు ధరలో ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy F70e 5G

  • 6.7-అంగుళాల 120Hz HD+ డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 చిప్‌సెట్
  • 6GB వరకు ర్యామ్, 25W ఛార్జింగ్‌తో భారీ 6,000mAh బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 16-ఆధారిత వన్ యూఐ 8 తో వస్తుంది
  • శాంసంగ్ 6 OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్
  • IP54 రేటింగ్, నాక్స్ వాల్ట్, వీగన్ లెదర్ బ్యాక్ ఫీచర్లు

Samsung Galaxy F70e 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త గెలాక్సీ F70e 5జీతో లాంచ్ కానుంది. అధికారిక లాంచ్ ముందు సౌత్ కొరియా టెక్ దిగ్గజం ఈ ఫోన్ గురించి కీలక వివరాలను వెల్లడించింది. డిజైన్, కలర్ ఆప్షన్లు, డిస్ ప్లే, కెమెరా, బ్యాటరీ విషయానికి వస్తే స్పెషల్ మైక్రోసైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కనిపించాయి.

ఈ ఫోన్ లైమ్‌లైట్ గ్రీన్, స్పాట్‌లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది. శాంసంగ్ ఇ-స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ ఛానల్ కు అందుబాటులో ఉండనుంది. పూర్తి అంచనా వివరాలపై ఓసారి లుక్కేయండి.

శామ్సంగ్ గెలాక్సీ F70e భారత్ లాంచ్ తేదీ, ధర అంచనాలివే :
భారత మార్కెట్లో ఫిబ్రవరి 9, 2026న శాంసంగ్ గెలాక్సీ F70e ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ. 15వేల కన్నా తక్కువగా ఉండొచ్చు. అయితే, ధర రేంజ్ ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.

శాంసంగ్ గెలాక్సీ F70e స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. హుడ్ కింద, ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్‌ పొందవచ్చు. 6GB వరకు ర్యామ్, 128GB వరకు స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ 6,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.

Read Also : BSNL Annual Plans : BSNL యూజర్లకు పండగే.. ఈ 2 వార్షిక రీఛార్జ్ ప్లాన్లు అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 365 రోజులు ఎంజాయ్!

25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16-ఆధారిత వన్ యూఐ 8 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ కావచ్చు. 6 జనరేషన్ OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ ఉండొచ్చనని లీక్‌లు సూచించాయి. ఈ ఫోన్ డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు IP54 రేటింగ్‌ పొందవచ్చునని సూచిస్తున్నాయి.

కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో రావొచ్చు. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఫినిషింగ్, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, 12 5G బ్యాండ్‌లకు సపోర్టు అందిస్తుంది.