Samsung Galaxy M05 Launch : శాంసంగ్ గెలాక్సీ M05 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్ల భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంతంటే?

Samsung Galaxy M05 Launch : శాంసంగ్ గెలాక్సీ ఎమ్05 ఫోన్ భారత మార్కెట్లో సింగిల్ 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7999కు పొందవచ్చు. ఈ ఫోన్ మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది.

Samsung Galaxy M05 With MediaTek Helio G85 SoC, 5,000mAh Battery

Samsung Galaxy M05 Launch : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ M05 ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. లేటెస్ట్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 64జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : Amazon Festival 2024 Sale : త్వరలో అమెజాన్‌‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు.. బెనిఫిట్స్ పొందాలంటే?

శాంసంగ్ ర్యామ్ ప్లస్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. రెండు ఏళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్‌లను పొందుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్05 గత ఏడాదిలో గెలాక్సీ ఎమ్04కి అప్‌గ్రేడ్‌గా వస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 25డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్05 ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎమ్05 ఫోన్ భారత మార్కెట్లో సింగిల్ 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7999కు పొందవచ్చు. ఈ ఫోన్ మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్, శాంసంగ్ వెబ్‌సైట్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్05 స్పెసిఫికేషన్లు :
డ్యూయల్-సిమ్ (నానో) గెలాక్సీ ఎమ్05 6.74-అంగుళాల హెచ్‌డీ+ (720×1,600 పిక్సెల్‌లు) పీఎల్ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని 1టీబీ వరకు విస్తరించవచ్చు.

శాంసంగ్ ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో అందుబాటులో ఉన్న మెమరీని వాస్తవంగా 8జీబీ వరకు విస్తరించవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎమ్05 డ్యూయల్ బ్యాక్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్/1.8 ఎపర్చరుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు ఫ్రంట్ సైడ్ 2.0 ఎపర్చరుతో 8ఎంపీ కెమెరా ఉంది. రెండు ఏళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందవచ్చ.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్05లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, వై-ఫై 802.11ఎ/బి/జి/ఎన్/ఏసీ, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనెస్, బెయిడూ, గాలిలియో, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్, ఇతర సెన్సార్ ఉన్నాయి. ఇంకా, అథెంటికేషన్ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M05లో 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 168.8 x 78.2 x 8.8ఎమ్ఎమ్, బరువు 195 గ్రాములు ఉంటుంది.

Read Also : Nissan Magnite Facelift : కొత్త కారు కొంటున్నారా? నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. భారత్‌‌లో లాంచ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు