Samsung Galaxy M14 5G launched in India with 6,000mAh battery, price starts at Rs 13,490
Samsung Galaxy M14 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం (Samsung) నుంచి భారత మార్కెట్లోకి కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. బడ్జెట్ రేంజ్‌లో వచ్చిన ఈ కొత్త 5G ఫోన్ ధరను అత్యంత సరసమైన ధరకే అందించనుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ద్వారా ఏప్రిల్ 21 నుంచి శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఈ హ్యాండ్‌సెట్ గెలాక్సీ M13కి సక్సెసర్ అని చెప్పవచ్చు. కానీ, కొద్ది ఫీచర్లతో చిన్న అప్‌గ్రేడ్‌గా వచ్చింది. శాంసంగ్ Galaxy M14 ఇప్పటికే యూరోపియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు భారత మార్కెట్లోకి శాంసంగ్ నుంచి లేటెస్ట్ 5G ఫోన్‌తో ఎంట్రీ ఇచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ M14 5G ధర ఎంతంటే? :
కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ M14 5G ప్రారంభ ధర రూ. 13,490గా ఉంది. 4GB RAM, 128GB స్టోరేజీ విషయానికి వస్తే.. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,490 నుంచి అందుబాటులో ఉంది. ధర వివరాలు బ్యాంక్ ఆఫర్‌తో సహా ఉంటాయి. కంపెనీ బ్యాంకు కార్డు పేరును వెల్లడించలేదు.
శాంసంగ్ గెలాక్సీ M14 స్పెసిఫికేషన్‌లు ఇవే :
శాంసంగ్ గెలాక్సీ M14 ఫోన్ 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లేతో వస్తుంది. Full HD+ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. ఈ స్క్రీన్ 90Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. ఈ డివైజ్ 4GB RAM, 128GB స్టోరేజీ సపోర్టుతో ఇస్తుంది. స్పెషల్ మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి ఇంటర్నల్ స్టోరేజీ పొడిగించే అవకాశాన్ని కూడా కంపెనీ ఇచ్చింది. ఆండ్రాయిడ్ 13 అవుట్ ది బాక్స్‌తో విక్రయిస్తోంది.
Samsung Galaxy M14 5G launched in India with 6,000mAh battery
ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. f/1.8 ఎపర్చరు, PDAFతో కూడిన 50-MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. మాక్రో, డెప్త్ షాట్‌లతో రెండు 2-MP సెన్సార్‌లతో వస్తుంది. ముందు భాగంలో, 13-MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చు. 1080p రిజల్యూషన్ వరకు వీడియోలను రికార్డ్ చేయొచ్చు. హుడ్ కింద, 6,000mAh బ్యాటరీ ఉంది.
కంపెనీ కేవలం 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు మాత్రమే సపోర్టును అందించింది. శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లతో అందించే 15W టెక్ కన్నా మెరుగైనది. అయినప్పటికీ, బ్రాండ్ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. బడ్జెట్ శాంసంగ్ ఫోన్‌గా చాలా మంది యూజర్లకు పెద్ద నిరాశను కలిగించవచ్చు. ఈ 5G ఫోన్ సిల్వర్, బ్లూ, డార్క్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.