Samsung Galaxy M17 5G (Image Credit To Original Source)
Samsung Galaxy M17 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. కొత్త శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్, మరెన్నో డిస్కౌంట్లు అందిస్తోంది. మీరు 15వేల లోపు ఫోన్ కొనాలని అనుకుంటే శామ్‌సంగ్ ఫోన్‌పై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ గెలాక్సీ M17 5జీ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‍లో అద్భుతమైన డీల్‌తో వస్తుంది.
ఈ ఫోన్ తగ్గింపు ధర రూ. 12,998కి కొనేసుకోవచ్చు. అసలు ధర రూ.16,499 నుంచి రూ.12,998కి తగ్గుతుంది. 4GB + 128GB వేరియంట్‌కు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. అదనంగా, కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.12,300 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. అయితే, రీసేల్ వాల్యూ అనేది మీ ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ M17 5జీ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M17 5జీ అనేది డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7తో రన్ అవుతుంది. ఫుల్-HD+ రిజల్యూషన్ (1,080×2,340 పిక్సెల్), 1,100 నిట్స్ HBM పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
Samsung Galaxy M17 5G (Image Credit To Original Source)
స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఆసక్తిగల వినియోగదారులు మైక్రో SD కార్డ్ ద్వారా ఆన్‌బోర్డ్ స్టోరేజీ కూడా విస్తరించవచ్చు.
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ షూటర్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ శాంసంగ్ గెలాక్సీ M17 5జీ ఫోన్ డిస్‌ప్లేతో టియర్‌డ్రాప్ కటౌట్‌లో 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ M17 5జీ కోసం 6 OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. గూగుల్, జెమిని లైవ్ తో సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ టూల్స్ సూట్ కూడా ఉంది. ఆన్-డివైస్ వాయిస్‌మెయిల్, శాంసంగ్ నాక్స్, వాల్ట్, వాయిస్ ఫోకస్, శాంసంగ్ వ్యాలెట్ కూడా సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు గెలాక్సీ M-సిరీస్ ఫోన్‌లతో “Tap And Payment” ఆప్షన్ ఎంచుకోవచ్చు.
కంపెనీ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ M17 5జీ ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్, NFC, Wi-Fi సపోర్టు ఇస్తుంది. డేటా ట్రాన్స్ ఫర్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ కూడా ఉంది. 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.