Samsung Galaxy M34 5G : జూలై 7న శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Samsung Galaxy M34 5G : భారత మార్కెట్లో జూలై 7న శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ లాంచ్ అవుతుంది. అధికారిక లాంచ్‌కు ముందు.. డివైజ్‌ ధర, టాప్ స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

Samsung Galaxy M34 5G price in India and specs leaked ahead of July 7 launch

Samsung Galaxy M34 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను (M) సిరీస్‌లో లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో జూలై 7న గెలాక్సీ M34 5G ఫోన్ లాంచ్ చేయనుంది. కంపెనీ, ఇప్పటికే ఈ డివైజ్ స్పెషిఫికేషన్లను షేర్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు మెయిన్ కెమెరా సెన్సార్ OIS సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, జూలై 7న అధికారికంగా లాంచ్ కానున్న ఈ డివైస్ గురించి మరిన్ని వివరాలను లీక్‌స్టర్లు రివీల్ చేశారు.

Read Also : WhatsApp Accounts Ban : 65 లక్షల భారతీయ వాట్సాప్ యూజర్ల అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

శాంసంగ్ గెలాక్సీ M34 5G ధర, స్పెక్స్ లీక్ :
విశ్వసనీయ లీక్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. రాబోయే శాంసంగ్ ఫోన్‌లో 6.5-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్‌ప్లే ఉంటుంది. శాంసంగ్ ఇన్‌హౌస్ చిప్, Exynos 1280 ద్వారా పవర్ అందిస్తుంది. 8GB/128 GB మోడల్‌ను కలిగి ఉంటుంది. అయితే, శాంసంగ్ MediaTek Dimensity 1080 చిప్‌సెట్‌ని ఎంచుకోవచ్చని నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటికే Galaxy A34తో చేసింది. ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్ 50MP, 8MP, 2MP సెన్సార్లను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది.

Samsung Galaxy M34 5G price in India and specs leaked ahead of July 7 launch

బ్రార్ ట్వీట్ ప్రకారం.. సెల్ఫీ కెమెరా 13MP ఉంటుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుందని, 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 25W ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుందని బ్రార్ తెలిపారు. ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ ధర రూ.18వేల నుంచి రూ.19వేల మధ్య ఉంటుందని బ్రార్ చెప్పారు. ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎక్కడో రూ. 21వేల నుంచి రూ. 24వేల వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లను లాంచ్ చేయనుందని, అందులో 6GB RAM, మరొకటి 8GB RAMతో ఉంటుందని తెలిపారు.

శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ :
శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ ఆకట్టుకునే ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ విశ్వసనీయమైన పనితీరు, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్, ఆకట్టుకునే డిస్‌ప్లేలను అందించవచ్చు. ఈ సిరీస్ లేటెస్ట్ గెలాక్సీ M33, గత ఏడాదిలో మేలో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ M33 ఫోన్ ధర రూ. 18,999 నుంచి లాంచ్ అయింది. ఈ ఫోన్ Exynos 1280 SoC ద్వారా అందిస్తుంది.

Read Also : Mobile Phone Prices : ఈ నెలలో అత్యంత చౌకైన ధరకే మొబైల్ ఫోన్లు, టీవీలు.. జీఎస్టీ రేటు తగ్గిందా? ఇందులో నిజమెంత?