Mobile Phone Prices : ఈ నెలలో అత్యంత చౌకైన ధరకే మొబైల్ ఫోన్లు, టీవీలు.. జీఎస్టీ రేటు తగ్గిందా? ఇందులో నిజమెంత?

Mobile Phone Prices : జూలై 1 నుంచి మొబైల్ ఫోన్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్‌టీ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్‌టీ రేటు తగ్గుతోందంటూ వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదు.

Mobile Phone Prices : ఈ నెలలో అత్యంత చౌకైన ధరకే మొబైల్ ఫోన్లు, టీవీలు.. జీఎస్టీ రేటు తగ్గిందా? ఇందులో నిజమెంత?

No, mobile phones and TVs are not getting cheaper from July 1

Updated On : July 3, 2023 / 7:15 PM IST

Mobile Phone Prices : సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఎక్కువగా వైరల్ అవుతుంది. దేశంలో స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్నుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ‘గృహ వస్తువులపై జీఎస్టీ నుంచి ఉపశమనం పొందవచ్చు అనే వార్త హల్‌చల్ చేస్తోంది. జీఎస్టీ అమలుకు ముందు నిర్దిష్ట గాడ్జెట్‌పై పన్ను రేటు, గాడ్జెట్‌కు ప్రస్తుత జీఎస్టీ రేటును చూపిస్తుంది. ఇందులో ఫోన్లు, టీవీలపై జీఎస్టీ పన్ను తగ్గినట్లు అందులో ఉంది. ఇప్పుడు, ప్రభుత్వం జూలై 1 నుంచి గాడ్జెట్‌లపై జీఎస్టీని తగ్గించిందని, త్వరలో ఫోన్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు అత్యంత చౌకైన ధరకే రానున్నాయని ఫొటో వైరల్‌గా మారింది.

Read Also : Amazon Prime Day Sale : జూలై 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్.. టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

ఈ ఫొటోను చూసిన సోషల్ మీడియా యూజర్లు ట్విట్టర్ వేదికగా మరింతగా వైరల్ చేయడంతో గందరగోళంగా మారింది. భారత మార్కెట్లో GST అమలులోకి రాకముందు మొబైల్ ఫోన్ ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేటును దాదాపు 31 శాతం తగ్గిందని పేర్కొంది. ఇప్పుడు, 18 శాతం జీఎస్టీ అందిస్తుంది. ఇతర గాడ్జెట్‌ల విషయంలో కూడా ఇంతే శాతాన్ని అందిస్తుంది. ట్విటర్ యూజర్లు, ప్రభుత్వం జీఎస్టీ రేటును తగ్గిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మొబైల్ ఫోన్‌లపై 31 శాతం నుంచి 18 శాతానికి, ఇప్పుడు జులై 1 నుంచి భారత్‌లో గాడ్జెట్‌ల ధరలు తగ్గుతాయని అంటున్నారు. ఇదే వార్తను నెట్టింట్లో తెగ షేర్ చేస్తున్నారు. గాడ్జెట్‌లపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు లేనందున ఇది పూర్తిగా తప్పు అని గమనించాలి.

No, mobile phones and TVs are not getting cheaper from July 1

No, mobile phones and TVs are not getting cheaper from July 1

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను జూలై 15 నుంచి 16 వరకు హోస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఈవెంట్ సందర్భంగా, ఈ-కామర్స్ సైట్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ గాడ్జెట్‌లతో సహా వివిధ వర్గాలలో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 14, iQOO 11, Redmi K50i 5G మరిన్ని వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ కూడా అద్భుతమైన డీల్‌లను ఆఫర్ చేస్తుందని భావిస్తున్నారు. అమెజాన్ బ్యాంక్ ఆఫర్‌లతో కొనుగోళ్లపై అదనపు డిస్కౌంట్లను అందించనుంది. ప్రైమ్ డే సేల్ సమయంలో, కొనుగోలుదారులు ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లు, EMI లావాదేవీలపై 10 శాతం అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.

అంతేకాకుండా, అమెజాన్ పే (Amazon Pay), ICICI కార్డ్‌తో కస్టమర్లందరూ అదనంగా 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రైమ్ మెంబర్‌లు ఈ కార్డ్‌కి సైన్ అప్ చేసి రూ. 2,500 వరకు వెల్‌కమ్ రివార్డ్‌లు, రూ. 300 క్యాష్‌బ్యాక్ (ప్రైమ్‌కు మాత్రమే కాకుండా) రూ. 2,200 విలువైన రివార్డ్‌లను కూడా పొందవచ్చు. అదనంగా, ప్రైమ్ సభ్యులు (Amazon Pay)తో అన్‌లిమిటెడ్ (Uber) రైడ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. 4 శాతం ఉబర్ క్రెడిట్‌గా, ఒక శాతం అమెజాన్ పే క్యాష్‌బ్యాక్‌గా, (Amazon.in)లో ఫ్యూచర్ రైడ్‌లు, షాపింగ్‌లపై సేవింగ్స్ అందిస్తుంది.

Read Also : WhatsApp Accounts Ban : 65 లక్షల భారతీయ వాట్సాప్ యూజర్ల అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!